అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతూ నాలుగు రోజుల్లో 21.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 34 కోట్ల మార్క్ ని అధిగమించింది. కాగా సినిమా మొత్తం మీద వర్కింగ్ డే టెస్ట్ లో అల్టిమేట్ లెవల్ లో పాస్ అవ్వగా సినిమా ఇప్పుడు 5 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి దుమ్ము లేపుతుంది.
తొలి రెండు షోల కి ఆల్ మోస్ట్ 4 వ రోజు తో పోల్చితే కేవలం 20% లోపు డ్రాప్స్ ని మాత్రమె సొంతం చేసుకున్న మజిలీ సినిమా సూపర్బ్ గా హోల్డ్ చేసింది, ఇక ఈ రోజు ఎలెక్షన్ కాంపైన్ అయిపోతుండటం తో ఈవినింగ్ షోల కి కొద్దిగా గ్రోత్ పెరిగే…
అవకాశం కూడా ఉంది, IPL మ్యాచ్ కొద్దిగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉన్నా ఆన్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి సినిమా ఈ రోజు జోరు ఇలాగే కొనసాగించితే కచ్చితంగా మరోసారి 1.5 కోట్లకు పైగా షేర్ ని రెండు రాష్ట్రాలలో అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే గనుక సినిమా 1.7 కోట్ల మార్క్ కి చేరువ అవ్వడమో దాటడమో జరుగుతుంది అని చెప్పాలి, ఏది ఏమైనా సినిమా లాంగ్ రన్ ని ఆల్ మోస్ట్ కన్ఫాం చేసుకోగా ఇప్పుడు ఒక్కో అడుగును కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ వైపు…
వేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ మూవీ గా నిలుస్తుంది అనడం లో ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. ఇక 5 వ రోజు ముగిసే సరికి సినిమా స్టేటస్ ఎలా ఉందొ తెలుసుకుని మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.