బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యే సినిమాలు కలెక్షన్స్ కొన్ని వారాల పాటు అప్ డేట్ అయ్యి తర్వాత పరుగును ముగించుకుని తర్వాత స్ట్రీమింగ్ సైట్స్ కి టెలివిజన్ లో టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. కానీ డిజిటల్ రిలీజ్ అయినా సినిమాలు అందునా పే పెర్ వ్యూ తో రిలీజ్ అయ్యే సినిమాలకు జనాలు ఎప్పుడు చూడాలి అనుకుంటే అప్పుడు డబ్బులు పే చేసి సినిమా చూస్తారు కాబట్టి బాక్స్ ఆఫీస్ లా…..
పరుగు అంత ఈజీగా కంప్లీట్ అవ్వలేదు, రీసెంట్ గా ఇలా పే పెర్ వ్యూ కాన్సెప్ట్ తో సాలిడ్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలు అన్నీ కూడా రామ్ గోపాల్ వర్మ వే. అందులో ఎక్కువ శాతం ఆ టైప్ సినిమాలు తీసిన వర్మ…
పవర్ స్టార్ పేరు తో తీసిన షార్ట్ ఫిల్మ్ ని తన స్టైల్ లో బాగా ప్రమోట్ చేసుకోవడం తో ఫుల్ ప్రాఫిట్స్ ని సొంతం చేసుకున్నాడు, ఈ సినిమా ను కేవలం 10 లక్షల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా.. అన్ని టీవీ ఛానెల్స్ లో ఫ్రీ పబ్లిసిటీ చేసుకుని సినిమాను తన సైట్ లోనే రిలీజ్ చేశాడు.
మొదటి రోజు 150 టికెట్ రేటు, తర్వాత 250 రేటు అని పెట్టిన రామ్ గోపాల్ వర్మ చేసిన పబ్లిసిటీ తో ఫస్ట్ డే సినిమాను 1 లక్షా 20 వేల మంది దాకా చూడగా తర్వాత ఓవరాల్ గా 55 వేలకు అటూ ఇటూ గా టికెట్ కోని ఆన్ లైన్ లో చూశారట. ఇక్కడికి పరుగు కంప్లీట్ అనుకుంటే…. మళ్ళీ కొద్దిగా షాక్ ఇస్తూ…
తర్వాత ఇప్పటి వరకు మరో 22 వేల టికెట్స్ సెల్ అయ్యాయట…యావరేజ్ గా టికెట్ రేటు 150 కిందే లెక్క తీసుకున్న ఈ కలెక్షన్స్ లెక్క 33 లక్షల మార్క్ ని అందుకుంటుంది.. ఓవరాల్ గా టోటల్ టికెట్ సేల్స్ మీద సినిమా కి 2.9 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని ఈ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ సొంతం చేసుకుని ఉంటాడని అంచనా… 10 లక్షలతో ఇది ఊహకందని ఊచకోత అనే చెప్పాలి.