Home న్యూస్ ఇదే ఫైనల్…. ఇస్మార్ట్ శంకర్ ఫైనల్ టాక్ ఇదే!!

ఇదే ఫైనల్…. ఇస్మార్ట్ శంకర్ ఫైనల్ టాక్ ఇదే!!

0

     పూరీ సినిమా అంటే మాస్ లో జాతరే… కానీ అలాంటి జాతర చూసి చాలా కాలమే అయింది… మళ్ళీ ఇప్పుడు రామ్ తో చేసిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ప్రీమియర్ షోలకి మంచి టాక్ నే సొంతం చేసుకుంది, పర్వాలేదు బాగుంది అంటూ ఓవర్సీస్ ఆడియన్స్ చెప్పడం తో క్లాస్ ఆడియన్స్ నుండే అలాంటి టాక్ వచ్చే సరికి ఇక్కడ ఎలాంటి వస్తుందా అని అందరు ఎదురు చూశారు.

అనుకున్నట్లే ఇక్కడ కూడా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి ఫ్యాన్స్ అండ్ మాస్ ఆడియన్స్ నుండి సినిమాకి సూపర్ టాక్ లభించింది, ఇక ఫైనల్ గా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే ఫ్యామిలీ అండ్ కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ని సినిమా సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా…

ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలో లౌడ్ డైలాగ్స్ అలాగే హీరోయిన్స్ గ్లామర్ షో కొంచం ఇబ్బంది పడ్డా ఓవరాల్ గా సినిమా బాగుంది అనిపించింది అంటూ ఎబో యావరేజ్ టాక్ ని చెబుతున్నారు. రామ్ కి ఫ్యామిలీస్ లో మంచి ఫాలోయింగ్ ఉండటం తో ఈ టాక్ సరిపోతుంది అని చెప్పొచ్చు.

ఇక కామన్ ఆడియన్స్ సినిమా లో అన్ని అంశాలు బాగా అనిపించాయని, ఈ మధ్య తెలుగు లో ఇలాంటి మాస్ మూవీ రాలేదని, స్టొరీ కొంచం ప్రిడిక్ట్ చేసేలా ఉన్నా పూరీ డైరెక్షన్, రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, హీరోయిన్స్ గ్లామర్ అండ్ మణిశర్మ ఎక్స్ లెంట్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసేలా చేశాయి అంటున్నారు.

మొత్తం మీద వారి నుండి సినిమాకి హిట్ కి తక్కువ కాని టాక్ లభించింది అని చెప్పొచ్చు. టోటల్ గా సినిమా ఫస్ట్ డే ఎండ్ కి వచ్చే సరికి ఎబో యావరేజ్ టు హిట్ రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంది అని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ భీభత్సం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here