సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram Movie) మొదటి రోజే సోషల్ మీడియాలో భారీగా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకోగా యావరేజ్ గా రేటింగ్ లు కూడా 2.5కి అటూ ఇటూగా సొంతం అయ్యాయి. అయినా కూడా పండగ సెలవుల అడ్వాంటేజ్ ను…
వాడుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఇప్పుడు ఫ్లాఫ్ మూవీస్ 2.5 రేటింగ్ ను సొంతం చేసుకున్న రీజనల్ మూవీస్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉంది. సినిమా 6 రోజుల్లో 98 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా…
7వ రోజు కలెక్షన్స్ తో ఇప్పుడు 100 కోట్ల షేర్ మార్క్ వైపు దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. రీజనల్ మూవీస్ పరంగా మిక్సుడ్ టాక్ తో ఇలాంటి వసూళ్ళని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి…
సినిమాకి సంక్రాంతి పండగ సెలవుల అడ్వాంటేజ్ లభించినా కూడా జనాలను మిక్సుడ్ టాక్ తో థియేటర్స్ కి రప్పించడం అన్నది మామూలు విషయం కాదు, సినిమా టాక్ కనుక అనుకున్న విధంగా వచ్చి ఉంటె కచ్చితంగా సాలిడ్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుని ఉండేది…
అయినా కానీ పండగ సెలవుల అడ్వాంటేజ్ ను సాలిడ్ గా వాడుకుంటూ ఇప్పుడు మిక్సుడ్ టాక్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకోబోతున్న ఈ సినిమా బిజినెస్ ను అందుకోవడానికి మాత్రం చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.