Home న్యూస్ ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో గామి రచ్చ….ఇక టాక్ వస్తే ఊచకోతే!!

ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో గామి రచ్చ….ఇక టాక్ వస్తే ఊచకోతే!!

0

యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) చేస్తున్న లేటెస్ట్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ అయిన గామి(Gaami Movie) ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి హైప్ ను సొంతం చేసుకోగా ఆడియన్స్ లో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

దాంతో బిజినెస్ పరంగా కూడా మంచి జోరుని చూపించిన ఈ సినిమా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కూడా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం… సినిమాకి అమెరికాలో ఆల్ రెడీ ప్రీ సేల్స్ ద్వారా 80 వేలకు పైగా గ్రాస్ బుకింగ్స్ జరిగాయి. సినిమా కి ప్రీమియర్స్ ద్వారా అక్కడ ఓవరాల్ గా…

120-150K డాలర్స్ ఓపెనింగ్స్ సొంతం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా మల్టీప్లెక్సులలో బుకింగ్స్ మంచి జోరునే చూపిస్తూ ఉన్నాయి. మాస్ సెంటర్స్ లో పెద్దగా బుకింగ్స్ లేవు కానీ ఒక్కసారి సినిమా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను కనుక సొంతం చేసుకుంటే….

అవలీలగా సాలిడ్ ఓపెనింగ్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సొంతం చేసుకునే అవాకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో 1.2-1.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను వరల్డ్ వైడ్ గా 2.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. సినిమా ఈ అంచనాలను మించిపోతుందో లేదో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here