Home న్యూస్ భీమా థియేటర్స్, బుకింగ్స్ రిపోర్ట్…..1st డే ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!!

భీమా థియేటర్స్, బుకింగ్స్ రిపోర్ట్…..1st డే ఎంత కలెక్ట్ చేయోచ్చు అంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మహా శివరాత్రి కానుకగా భారీ లెవల్ లో రిలీజ్ అవుతున్న మాచో స్టార్ గోపీచంద్(Gopichand) నటించిన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) వరల్డ్ వైడ్ గా 11.30 కోట్ల వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా సినిమా 12 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా…

సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఇప్పుడు మొత్తం మీద 550 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండగా రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లు కలిపి మరో 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా సినిమా వరల్డ్ వైడ్ గా 750 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందే…

మొదలు అవ్వగా మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ ఉన్నా కూడా క్లాస్ సెంటర్స్ లో మాత్రం సినిమా బుకింగ్స్ అంతంత మాత్రమె ఉన్నాయి. గోపీచంద్ ప్రీవియస్ మూవీస్ ఇంపాక్ట్ ఉండటంతో ఇప్పుడు భీమా బాక్స్ ఆఫీస్ దగ్గర మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి.

ఓవరాల్ గా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే….ఒకవేళ టాక్ కనుక అనుకున్న దాని కన్నా బెటర్ గా ఉంటే షో షో కి మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…. ఇక మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here