Home న్యూస్ అంత కష్టపడ్డాడు….కానీ వచ్చింది ఇది….పాపం వరుణ్ తేజ్!

అంత కష్టపడ్డాడు….కానీ వచ్చింది ఇది….పాపం వరుణ్ తేజ్!

1

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలంటైన్(Operation Valentine) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చింది. సినిమా కోసం వరుణ్ తేజ్ తన కెరీర్ లో ఏ సినిమా కి కూడా చేయని రేంజ్ లో ప్రమోషన్స్ చేశాడు. నార్త్ సైడ్ హిందీ వర్షన్ కోసం ఎన్నో ప్రమోషనల్ ఈవెంట్స్ చేయగా తర్వాత..

తెలుగు లో కూడా అన్ని చోట్లకు వెళ్లి సినిమా గురించి అందరికీ తెలిసేలా చాలా ప్రమోషన్స్ ని చేశాడు, కానీ ఇంత కష్టపడి ప్రమోషన్స్ చేసిన తర్వాత సినిమా కి మొదటి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది… దాంతో ఆ ఇంపాక్ట్ సినిమా ఓవరాల్ గా ఓపెనింగ్స్ పై పడగా మొదటి రోజు చాలా నిరాశ కలిగించే…

కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుని మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది…. ఇక హిందీలో అంత కష్టపడి ప్రమోషన్స్ ని చేస్తే పట్టుమని 10 లక్షల రేంజ్ లో కూడా వసూళ్ళని సినిమా సొంతం చేసుకోలేక పోయింది. ఇది వరకు వరుణ్ తేజ్ మూవీస్ అంటే మినిమమ్ ఓపెనింగ్స్ వస్తూ ఉండేవి కానీ…

ఇప్పుడు బాక్ టు బాక్ నిరాశ పరిచే సినిమాలతో మార్కెట్ భారీగా డ్రాప్ అయ్యింది, కానీ తన లేటెస్ట్ మూవీ కోసం ఎంత కష్టపడి ప్రమోషన్స్ చేసినా కూడా మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా సినిమా దక్కించుకోలేక పోయింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వీకెండ్ లో ఏమైనా గ్రోత్ ని చూపించే అవకాశం ఉందో లేదో చూడాలి ఇప్పుడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here