Home న్యూస్ గామి మూవీ రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

గామి మూవీ రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

టాలీవుడ్ లో రీసెంట్ టైంలో మంచి బజ్ ను సొంతం చేసుకున్న సినిమా విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie Telugu Review) ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు సాలిడ్ గా పెరిగి పోగా ఇప్పుడు మంచి బజ్ నడుమ రిలీజ్ అయిన గామి సినిమా ఎంతవరకు ఆ అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…..ఒక సమస్యతో భాదపడే హీరోకి  హిమాలయాలలోని ద్రోణగిరి పర్వాతాలలో 36 ఏళ్లకి ఒకసారి స్వయం ప్రకాశితం అయ్యే పాణిపత్రాలు ద్వారా నయం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. హీరోకి సైమల్ టేనియస్ గా మరో 2 ఉపకథలు సాగుతాయి…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది అసలు కథ….

విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము దులిపేశాడు, తన యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్ రోల్ కి తగ్గట్లు మెప్పించగా చాందిని చౌదరి కూడా తన రోల్ వరకు బాగా నటించగా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో బాగా నటించారు… సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉంటే సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్స్ లెంట్ గా మెప్పించింది….

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ఫ్లాట్ గా అనిపించినా కూడా చాలా చోట్ల ఎంగేజింగ్ గా ఉంది, సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ హైలెట్, విజువల్స్ సినిమా బడ్జెట్ కి ఎన్నో రెట్లు ఎక్కువగా అనిపించింది…. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాట్చ్ అనిపించేలా ఉండగా ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ చాలా యూనిక్ గా ఉండగా….

ఆ పాయింట్ ని చాలా వారకు ఆడియన్స్ అంచనాలకు తగ్గట్లు తెరకెక్కించాడు, కానీ కొన్ని చోట్ల ఫ్లాట్ నరేషన్, కొన్ని చోట్ల ఎమోషన్స్ అంతగా పండకపోయినా కూడా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ తో గామి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ ను కలిగించడం ఖాయం…

మొత్తం మీద సినిమా ఫ్రెష్ స్టొరీ పాయింట్, విశ్వక్ సేన్ పెర్ఫార్మెన్స్, ఎక్స్ లెంట్ విజువల్స్, చాలా సీన్స్ ను ఎలివేట్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్, వెరీ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి ఓవరాల్ గా మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే ముందే చెప్పినట్లు కొన్ని చోట్ల సినిమా డ్రాగ్ అవ్వడం, అలాగే కొన్ని చోట్ల కథ కొంచం ట్రాక్ తప్పినట్లు అనిపించడం మేజర్ డ్రా బ్యాక్స్ అని చెప్పాలి….

మొత్తం మీద రెగ్యులర్ మూవీస్ చూసి చూసి బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ కావాలి అనుకుంటే గామి సినిమాకి వెళ్ళొచ్చు, కొంచం బోర్ అనిపించే సీన్స్ ఉన్నప్పటికీ సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలగడం ఖాయం, అదే టైంలో రెగ్యులర్ అండ్ మాస్ మూవీస్ చూసే ఆడియన్స్ కి సినిమా పర్వాలేదు అనిపించేలా ఉంటుంది…. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here