Home న్యూస్ గామి ప్రీమియర్ షో టాక్ ఏంటి….హిట్టా…ఫట్టా!!

గామి ప్రీమియర్ షో టాక్ ఏంటి….హిట్టా…ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శివరాత్రి వీకెండ్ లో ఆడియన్స్ ను అలరించడానికి వచ్చిన సినిమాల్లో ట్రైలర్ తో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమా విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గామి(Gaami Movie Short Review)….వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లోనే సినిమా రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ ను…

కంప్లీట్ చేసుకున్న సినిమాకి ఇక్కడ నుండి ఫస్ట్ టాక్ ఎలా ఉంది అన్నది ఆసక్తిగా మారగా….స్టోరీ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయకున్నా కూడా ఒక తీవ్ర సమస్యతో బాధపడే హీరోకి ఆ సమస్యకి  సొల్యూషన్ హిమాలయాలలోని ద్రోణగిరి పర్వాతాలలో ఉంటుంది. దాంతో హీరో ప్రయాణం కొనసాగుతుంది, ఈ జర్నీ లో ఎలా సాగింది అన్నది కథ పాయింట్…

సినిమా స్టార్ట్ అవ్వడం మంచి క్యూరియాసిటీతో స్టార్ట్ అయ్యి అసలు కథ మొదలు అయిన తర్వాత కొన్ని ఉప కథలతో జర్నీ సాగగా అక్కడక్కడా కొంచం స్లో అయిన ఫీలింగ్ కలిగినా కానీ అబ్బుర పరిచే విజువల్స్, కొన్ని ఎక్స్ లెంట్ సీన్స్ తో ఫస్టాఫ్ అంతా చాలా బాగా అనిపించింది అంటున్నారు. ఇక సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగి పోగా…

సెకెండ్ ఆఫ్ కూడా ఆ అంచనాను చాలా వరకు అందుకుందని అంటున్నారు, విశ్వక్ సేన్ రోల్ సినిమాకి హైలెట్ అయితే టేకింగ్ అండ్ విజువల్స్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు, సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ని అయితే చూస్తున్న ఆడియన్స్ కి కలిగేలా చేయడంలో…

గామి సినిమా సక్సెస్ అయ్యిందని అంటున్నారు, ఓవరాల్ గా సినిమాకి ప్రీమియర్స్ కంప్లీట్ అయిన తర్వాత మంచి రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి, ఇక్కడ మాస్ అండ్ రెగ్యులర్ ఆడియన్స్ నుండి కూడా ఇదే రేంజ్ లో టాక్ ను సినిమా కనుక సొంతం చేసుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర గామి దంచి కొట్టే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here