Home న్యూస్ OTTలో 3 క్రేజీ కొత్త హిట్ సినిమాలు…..ఈ రోజు ఇక పండగే!

OTTలో 3 క్రేజీ కొత్త హిట్ సినిమాలు…..ఈ రోజు ఇక పండగే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ అనుకున్న రేంజ్ లో సినిమాలు అంచనాలను అందుకోలేదు, ఒకటి రెండు సినిమాలు తప్పితే మిగిలిన సినిమాలు పెద్దగా జోరు అయితే చూపలేదు… కానీ ఈ అన్ సీజన్ లో రిలీజ్ అయిన మూవీస్ లో కొన్ని సినిమాలు మంచి జోరు నే చూపించాయి. వాటిలో మార్చ్ నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చిన….

తెలుగు మూవీస్ గామి(Gaami OTT Release), ఓం భీమ్ బుష్(Om Bheem Bush OTT Release) మరియు మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు(Premalu Telugu OTT Release) సినిమాలు ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా జోరు చూపించాయి. వీటిలో ప్రేమలు తెలుగు లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. గామి ఎక్స్ లెంట్ స్టార్ట్ తర్వాత…

స్లో అయినా కూడా బ్రేక్ ఈవెన్ మీద లాభాలను సొంతం చేసుకుని, ఇక ఓం భీమ్ బుష్ మంచి స్టార్ట్ తర్వాత స్లో అయినా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని టచ్ చేసింది…ఇప్పుడు ఈ మూడు హిట్ సినిమాలు కూడా ఒకే రోజు డిజిటల్ లో రిలీజ్ అయ్యాయి. ఏప్రిల్ 12న సినిమాలు అన్నీ కూడా వివిధ OTT ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అయ్యాయి…

గామి మూవీ జీ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది అన్ని భాషల్లో…ఇక ఓం భీమ్ బుష్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ అయ్యింది…ఇక ప్రేమలు మూవీ ఇతర సౌత్ భాషల వర్షన్ లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అవ్వగా తెలుగు వర్షన్ ఆహా వీడియోలో రిలీజ్ అయ్యింది…

మొత్తం మీద రీసెంట్ గా వచ్చిన మూడు కొత్త హిట్ సినిమాలు ఇప్పుడు ఒకే రోజులో డిజిటల్ రిలీజ్ అవ్వడంతో ఈ సినిమాలు థియేటర్స్ లో మిస్ అయిన ఆడియన్స్ కి ఈ వీకెండ్ పండగే అని చెప్పాలి. అన్ సీజన్ లో హిట్స్ గా నిలిచిన ఈ సినిమాలకు ఇప్పుడు డిజిటల్ లో ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటాయో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here