బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ మొదటి నెల పూర్తి అయ్యింది. సంక్రాంతి సీజన్ లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్ మరియు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల మధ్య భారీ పోటిలో ఊహకందని రేంజ్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాస్ ఊచకోత కోసింది…
మిగిలిన సినిమాల మీద ఎపిక్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేయగా మిగిలిన సినిమాలు ఓపెనింగ్స్ ఆకట్టుకున్నా కూడా తర్వాత మాత్రం స్లో డౌన్ అయ్యాయి…. మొత్తం మీద ఈ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన మూవీస్ డీసెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్నాయి…
మొత్తం మీద ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఊచకోత కోసింది…సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్ లో గేమ్ చేంజర్ మూవీ ముందు రిలీజ్ అవ్వగా మొత్తం మీద 10 రోజుల పాటు నాన్ స్టాప్ గా…
కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుంది. మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది. ఇక తర్వాత రిలీజ్ అయిన బాలయ్య డాకు మహారాజ్ మూవీ కూడా రిమార్కబుల్ స్టార్ట్ తర్వాత కూడా స్లో డౌన్ అయినా కూడా…
ఓవరాల్ గా 8 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని కుమ్మేసింది… ఇక ఈ సినిమాల తర్వాత వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ అన్ని సినిమాల రన్ ని బ్రేక్ చేసి ఊహకందని లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమా…
ఏకంగా 20 రోజుల పాటు కంటిన్యూగా ప్రతీ రోజూ కోటికి తగ్గకుండా షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది…ఈ సంక్రాంతికే కాకుండా ఓవరాల్ గా టాలీవుడ్ లో ఎక్కువ రోజులు కోటికి తగ్గకుండా షేర్ ని అందుకున్న సినిమాల్లో ఒకటిగా కుమ్మేసింది ఈ సినిమా…ఇక ఈ ఇయర్ లో మిగిలిన సినిమాలు ఇదే రేంజ్ లో రచ్చ చేస్తాయో లేదో చూడాలి.