మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ గని ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 750 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం పదండీ… ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…. తల్లి నదియా కొడుకు వరుణ్ తేజ్ ని బాక్సింగ్ జోలికి వెళ్లొద్దు అని చెబుతూ ఉంటుంది, కానీ వరుణ్ తేజ్ తన తల్లికి తెలియకుండా…
బాక్సింగ్ పోటిలలో పాల్గొంటూ ఒక్కో అడుగు ముందుకేస్తూ ఉంటాడు, నదియా కొడుకుని బాక్సింగ్ వైపు వెల్లకు అని చెప్పడానికి వరుణ్ తేజ్ తండ్రి విషయంలో జరిగిన ఓ ఇంసిడెంట్ కారణం అవుతుంది. కానీ దాని వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకున్నాక వరుణ్ తేజ్ ఏం చేశాడు అన్నది మొత్తం మీద సినిమా కథ…
ఓవరాల్ గా కథ పాయింట్ వరకు బాగానే ఉన్నా కానీ డైరెక్టర్ ఫస్టాఫ్ కథ ను మలచిన విధానం చాలా నెమ్మదిగా, కంప్లీట్ గా ప్రిడిక్ట్ చేసే విధంగా ఉండటంతో ఏ దశలో కూడా సినిమా అంచనాలను అందుకోలేక పోతుంది, కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి కొంచం స్పీడ్ అందుకునే సినిమా…
సెకెండ్ ఆఫ్ మాత్రం ఫస్టాఫ్ కన్నా బెటర్ గా సాగుతూ ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తుంది కానీ కథ ఏంటి అనేది, తర్వాత సీన్ ఏంటి అనేది చూసే ఆడియన్స్ ఈజీగా ప్రిడిక్ట్ చేసేలా ఉండటం, ఆ కథలో ఉన్న ఎమోషన్స్ ఆడియన్స్ అస్సలు ఫీల్ అయ్యేలా కనెక్ట్ అయ్యేలా లేక పోవడం సినిమా కి బిగ్గెస్ట్ డ్రా బ్యాక్స్… ఉన్నంతలో వరుణ్ తేజ్ మట్టుకు తన రోల్ కి..
ఫుల్ న్యాయం చేశాడు, తన పెర్ఫార్మెన్స్ కూడా బాగా మెప్పించగా హీరోయిన్ సాయు మంజ్రేకర్ జస్ట్ ఓకే అనిపించుకోగా ఉపేంద్ర, నదియా, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర మరియు జగపతిబాబు లాంటి భారీ స్టార్ కాస్ట్ బాగానే ఆకట్టుకున్నారు అని చెప్పాలి. తమన్ మ్యూజిక్ జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు… ఎడిటింగ్ ఫస్టాఫ్ లో నీరసంగా ఉండగా సెకెండ్ ఆఫ్ పర్వాలేదు…
సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా మెప్పిస్తాయి… ఇక డైరెక్షన్ విషయానికి వస్తే కిరణ్ కొర్రపాటి ఎంచుకున్న పాయింట్ బాగున్నా దాన్ని అనుకున్న విధంగా ప్రజెంట్ చేయలేక పోయాడు… సెకెండ్ ఆఫ్ కొంచం బెటర్ గా ఉన్నా ఫస్టాఫ్ మాత్రం సహనానికి పరీక్షగా నిలుస్తుంది… మొత్తం మీద సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే…
వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్, గని టైటిల్ సాంగ్, ఇంటర్వెల్ సీన్, సెకెండ్ ఆఫ్ ఫస్టాఫ్ కన్నా బెటర్ గా ఉండటం, రిచ్ ప్రొడక్షన్ ఫాల్యూస్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్టాఫ్, కథ చాలా ప్రిడిక్టబుల్ గా ఉండటం, ఎమోషన్స్ అంతగా వర్కౌట్ అవ్వక పోవడం మరియు లెంత్ ఎక్కువ అవ్వడం లాంటివి మేజర్ మైనస్ పాయింట్స్ అని చెప్పాలి…
మొత్తం మీద రీసెంట్ టైం లో బాక్సింగ్ నేపధ్యంలో ఎలాంటి సినిమాలు లేకున్నా కానీ గని చూస్తున్న టైం లో చాలా సినిమాలు తిరిగి గుర్తుకు వస్తాయి. అలాగే కథ ఏంటి తర్వాత సీన్ ఏమవుతుంది అన్నది చాలా వరకు ఆడియన్స్ అంచనాలకు తగ్గట్లుగానే సాగడంతో సినిమా మొత్తం మీద ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది… సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్…