మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆడియన్స్ ముందుకు ఇప్పుడు గని సినిమాతో వచ్చేస్తున్నాడు, సినిమా మొదలు అయిన టైం లో బాక్సింగ్ నేపధ్యంలో మూవీ అవ్వడంతో మంచి బజ్ ఉన్నప్పటికీ కూడా లేట్ అవుతూ రావడంతో బజ్ మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. దాంతో ఆ ఇంపాక్ట్ సినిమా బిజినెస్ పైన కూడా పడుతుంది అనుకుంటే సినిమా కి ఓవరాల్ గా 25 కోట్లకు పైగానే బిజినెస్ ఓవరాల్ గా సొంతం అవ్వగా బ్రేక్ ఈవెన్ కోసం…
సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 26.3 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ టార్గెట్ ను అందుకోవాలి అంటే సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా అసలు రిలీజ్ అవుతున్న విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు…
సినిమా నైజాంలో 175 థియేటర్స్ లో, సీడెడ్ లో 110 థియేటర్స్ లో ఆంధ్ర లో 250 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను ప్లాన్ చేశారు, దాంతో 530 కి పైగానే థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ డిసాస్టరస్ అనిపించే విధంగా ఉందని చెప్పాలి ఇప్పుడు… అసలు బుకింగ్స్ లో మినిమమ్…
ఇంపాక్ట్ కూడా కనిపించలేదు ఎక్కడా కూడా… దాంతో రీసెంట్ టైం లో వరుణ్ తేజ్ మూవీస్ ఓపెనింగ్స్ తో పోల్చితే ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా నిరాశ పరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్ టైం లో వరుణ్ తేజ్ మూవీస్ లో అంతరిక్షం సినిమా 1.3 కోట్ల లోపు ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇప్పుడు సినిమా బుకింగ్స్ అదే రేంజ్ లో ఉండగా కంప్లీట్ గా సినిమా…
మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి ఇప్పుడు… మొత్తం మీద టాక్ బాగుంటే షో షోకి కలెక్షన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ 2.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండొచ్చు…. అది జరగాలి అంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చూపెట్టాల్సి ఉంటుంది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.