Home న్యూస్ 2.65CR లీడ్….బిజినెస్ మాన్ రికార్డ్ ఔట్….విజయ్ ఫ్యాన్స్ మాస్ రికార్డ్!

2.65CR లీడ్….బిజినెస్ మాన్ రికార్డ్ ఔట్….విజయ్ ఫ్యాన్స్ మాస్ రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) పుట్టిన రోజు టైంలో మహేష్ కెరీర్ లో మంచి మాస్ మూవీగా నిలిచిన బిజినెస్ మాన్(Business Man Re Release) మూవీని రీ రిలీజ్ చేయగా ఆ సినిమా రీ రిలీజ్ మూవీస్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో రికార్డ్ ను నమోదు చేసింది….

ఆ తర్వాత టైంలో రీ రిలీజ్ ల ట్రెండ్ స్లో అవ్వడంతో టాలీవుడ్ లో రీ రిలీజ్ ల మూవీస్ కి పెద్దగా ఇంపాక్ట్ అయితే కలెక్షన్స్ పరంగా కనిపించడం తగ్గిపోగా కోలివుడ్ లో రీసెంట్ గా టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన 20 ఏళ్ల ఓల్డ్ మూవీ గిల్లి(Ghilli Movie Re Release) రీ రిలీజ్ అవ్వగా కొత్త సినిమాలు ఏవి కూడా…

పెద్దగా లేక పోవడంతో ఆడియన్స్ ఎగబడి మరీ ఈ సినిమాను థియేటర్స్ లో చూశారు. లోకల్ గానే కాకుండా ఓవర్సీస్ లో సైతం ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను అందుకోవడంతో గిల్లి మూవీ రీ రిలీజ్ మూవీస్ లో బిగ్గెస్ట్ డే 1 రికార్డ్ ను నమోదు చేసింది. మహేష్ బిజినెస్ మాన్ మూవీ రీ రిలీజ్ డే 1 లో టోటల్ గా ….

5.27 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుని లాస్ట్ ఇయర్ రికార్డ్ కొట్టింది. ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన గిల్లి మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 7.92 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. బిజినెస్ మాన్ కి గిల్లి మూవీ కి మధ్య గ్యాప్ ఇప్పుడు…

2.65 కోట్ల రేంజ్ లో ఉంది అంటే ఏ రేంజ్ లో గిల్లి మూవీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊచకోత కోసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక రెండో రోజు కూడా రీ రిలీజ్ లో సాలిడ్ హోల్డ్ ని చూపిస్తున్న ఈ సినిమా లాంగ్ రన్ లో అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here