Home న్యూస్ ఇండస్ట్రీ హిట్ ని దాటేసిన ఎక్స్ పెరి మెంటల్ మూవీ…అరాచకం ఇది!

ఇండస్ట్రీ హిట్ ని దాటేసిన ఎక్స్ పెరి మెంటల్ మూవీ…అరాచకం ఇది!

0

ఎక్స్ పెరి మెంటల్ మూవీ అంటే ఆ సినిమా సక్సెస్ అవ్వడమే చాలా పెద్ద విషయం అని చెప్పాలి. అలాంటిది ఆ ఎక్స్ పెరి మెంటల్ మూవీ రికార్డులు సృష్టించే కలెక్షన్స్ ని అందుకోవడం అన్నది చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. లేటెస్ట్ గా మళయాళ ఇండస్ట్రీ లో ఇలాంటివే వరుస పెట్టి జరుగుతూ ఉండటం విశేషం.

బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్ మూవీస్ తో రచ్చ లేపుతున్న మలయాళ ఇండస్ట్రీ నుండి రీసెంట్ గా మంజుమ్మేల్ బాయ్స్(Manjummel Boys) మూవీ ఎపిక్ కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసింది….240 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన ఈ సినిమా ఈ ఏడాదికి హైయెస్ట్ కలెక్షన్స్ ని కేరళలో సొంతం చేసుకుంది కానీ…

ఓవరాల్ గా అన్ని చోట్లా రికార్డులు కొట్టినా కేరళలో మాత్రం కొత్త రికార్డ్ ను కొట్టలేదు….కానీ ఈ ఇయర్ రికార్డ్ కొట్టిన ఈ సినిమా కలెక్షన్స్ ని ఇప్పుడు మరో బిగ్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) చాలా టైం గా తీసిన సినిమా ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)(The Goat Life Movie) బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది…

వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 150 కోట్ల మార్క్ ని అందుకున్న ఈ సినిమా కేరళలో మంజుమ్మేల్ బాయ్స్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది ఇప్పుడు. ఆ సినిమా ఆల్ మోస్ట్ రన్ ఎండ్ టైం కి వచ్చేయడంతో ఇప్పటి వరకు 72 కోట్ల లోపు గ్రాస్ ను అందుకుంటే ఆడుజీవితం మాత్రం ఏకంగా 73 కోట్ల కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని…

ఈ ఇయర్ కేరళలో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. దాంతో పాటు కేరళలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ లో కూడా టాప్ 3 లో ఒకటిగా దూసుకు పోతూ ఉండటం విశేషం, ఎక్స్ పెరి మెంటల్ మూవీ కి ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మాత్రం మామూలు విషయం కాదనే చెప్పాలి. 

Aadujeevitham - The Goat Life 4 Days Total WW Collections....Fastest 65CR Grosser in Mollywood!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here