టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ దసరా బరిలో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది, సినిమా ఓవరాల్ బిజినెస్ రేంజ్ 91 కోట్ల దాకా ఉండగా సినిమా 92 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా దసరా బరిలో ఇతర సినిమాల నుండి పోటి వలన తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్స్ కౌంట్ చాలా వరకు తగ్గింది. ముఖ్యంగా ఆచార్య రిజల్ట్ ఎఫెక్ట్ కూడా ఉండగా…
ఆచార్య థియేటర్స్ కౌంట్ కన్నా కూడా తక్కువ కౌంట్ నే తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది, కానీ టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ సాలిడ్ గానే ఉందని చెప్పాలి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో 715 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా…
టోటల్ వరల్డ్ వైడ్ గా ఆల్ మోస్ట్ 1705 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ నే సొంతం చేసుకోబోతుంది ఇప్పుడు. ఒకసారి టోటల్ థియేటర్స్ కౌంట్ లెక్కలను గమనిస్తే…
👉Nizam – 245+
👉Ceeded – 160+
👉Andhra – 310+
Total AP TG:- 715+
👉Hindi+Ka+ROI – 540
👉OS – 450+
Total WW:- 1705+
ఇదీ మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ థియేటర్స్ కౌంట్ లెక్క. ఓవరాల్ గా ఈ థియేటర్స్ ని దసరా టైం లో సొంతం చేసుకోవడం, అది కూడా పోటిలో ఉండగా బిగ్గెస్ట్ ఫ్లాఫ్ సినిమా ఎఫెక్ట్ ఉన్నా కానీ దక్కించుకోవడం మెగా మాస్ అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.