Home న్యూస్ గోపీచంద్ విశ్వం టీసర్ రివ్యూ….రకరకాలుగా ఉందిగా!

గోపీచంద్ విశ్వం టీసర్ రివ్యూ….రకరకాలుగా ఉందిగా!

0

మ్యాచో స్టార్ గోపీచంద్(Gopichand) బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది, ఎప్పటి నుండో ఓ మంచి కంబ్యాక్ మూవీ కోసం ట్రై చేస్తూనే ఉన్నా కూడా పెద్దగా అంచనాలను అందుకునే సినిమాలు రావడం లేదు, ఈ మధ్యనే భీమా సినిమాతో వచ్చినా ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేక పోయింది…

ఇలాంటి టైంలో ఎప్పటి నుండో హిట్ కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ శ్రీనువైట్ల డైరెక్షన్ లో గోపీచంద్ చేస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వం(viswam Movie) ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫాం చేస్తూ అఫీషియల్ టీసర్ ను కూడా రిలీజ్ చేశారు…

టీసర్ క్వాలిటీ, విజువల్స్ చాలా రిచ్ గా ఉండగా స్టార్ కాస్ట్ కూడా చాలా పెద్దదిగానే ఉండగా కమెడియన్స్ తో టీసర్ మొత్తం నిండిపోయింది…అక్కడ వరకు బాగానే ఉంది కానీ వింటేజ్ శ్రీనువైట్ల టచ్ తో సినిమా ఉంటుంది అంటూ చెప్పారు కానీ టీసర్ లో అలాంటి….

మెరుపులు పెద్దగా కనిపించలేదు అనిపించింది, సీన్ బై సీన్ వస్తూ వెళుతూ టీసర్ కట్ లో ఏవి కూడా పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు, గోపీచంద్ లుక్స్ వరకు అదరగొట్టేశాడు, డైలాగ్స్ కూడా బాగున్నాయి….కొట్టాడు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం అన్న సీన్ టీసర్ లో బాగా హైలెట్ అయింది…

అలాగే టీసర్ ఎండ్ లో వెన్నెల కిషోర్ సీన్స్ పర్వాలేదు అనిపించాయి. ఓవరాల్ గా టీసర్ లో సినిమా కథని ఏమి రివీల్ చేయలేదు…ఫస్ట్ మొత్తం కామెడీ సీన్స్ తో నింపేశారు, సడెన్ గా యాక్షన్ మోడ్ కి షిఫ్ట్ అయ్యి హీరో ఎవరి వెంటో పడుతున్నట్లు చూపించారు….

మొత్తం మీద ఒకప్పటి శ్రీనువైట్ల రేంజ్ టీసర్స్ తో పోల్చితే విశ్వం టీసర్ రకరకాలుగా అనిపించింది, కానీ సినిమా బాగుంటే టీసర్ ఎలా ఉన్నా జనాలు పట్టించుకోరు… భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్న విశ్వం సినిమాతో గోపీచంద్ మరియు శ్రీనువైట్లలు మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకోవాలని కోరుకుందాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here