అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీస్ లో పేరు తోనే మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేసిన సినిమా హనుమాన్…. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ టీసర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా టీసర్ చూసిన తర్వాత సినిమా మీద ఉన్న అంచనాలు అన్నీ కూడా ఊహకందని లెవల్ లో పెరిగిపోయాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి ఇప్పుడు…
ఆ రేంజ్ లో టీసర్ ఆకట్టుకుంది, క్వాలిటీ పరంగా రీసెంట్ గా వచ్చిన అనేక 400-500 కోట్ల రేంజ్ బడ్జెట్ అంటూ చెప్పుకున్న సినిమాల క్వాలిటీతో పోల్చితే ఎక్స్ లెంట్ విజువల్స్ తో తెరకెక్కిన హనుమాన్ మూవీ టీసర్ లో అడుగడుగునా క్వాలిటీ గ్రాఫిక్స్ అబ్బుర పరిచాయి.
కెమరా వర్క్ కూడా ఎక్స్ లెంట్ అనిపించే విధంగా సినిమా కథ హనుమంతుడి మణి చుట్టూ తిరిగే కథగా టీసర్ లో తెలుస్తూ ఉండగా టీసర్ లో ఉన్న అన్ని షాట్స్ ఒకెత్తు అయితే టీసర్ చివర్లో కొండ గుహలలో మొత్తం మంచుతో నిండిపోయినా కానీ శ్రీరామ్ అంటూ రామజపం చేస్తున్న…
హనుమాన్ ని చూపించిన సన్నివేషం అయితే రోమాలు నిక్కబోర్చేలా చేసింది అని చెప్పాలి. ఆ ఒక్క షాట్ తో టీసర్ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఓవరాల్ గా అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీస్ లో సరిగ్గా ప్రమోట్ చేస్తే ఈ సినిమా కూడా అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.