Home న్యూస్ బంగార్రాజు-రౌడీ బాయ్స్ ని ఓడించిన హీరో….మైండ్ బ్లాంక్!!

బంగార్రాజు-రౌడీ బాయ్స్ ని ఓడించిన హీరో….మైండ్ బ్లాంక్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతి మరీ అనుకున్న రేంజ్ లో అయితే రచ్చ చేయలేదు కానీ ఉన్నంతలో బంగార్రాజు సినిమా పండగ సెలవుల టైం లో మంచి వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక బంగార్రాజు కాకుండా మరో 2 సినిమాలు సంక్రాంతి రేసులో పోటి పడ్డాయి… అవే టాలీవుడ్ లో హీరోలు పరిచయం అయిన ఆశిష్ నటించిన రౌడీ బాయ్స్ మరియు అశోక్ గల్లా హీరోగా పరిచయం అయిన హీరో సినిమాలు…

ఈ మూడు సినిమాల మధ్యే సంక్రాంతి పోటి రంజుగా జరిగింది కానీ పోటి లో బంగార్రాజు ని తట్టుకుని ఏ సినిమా కూడా నిలవలేక పోయింది… మొత్తం మీద చూసుకుంటే ఫస్ట్ బంగార్రాజు దుమ్ము లేపే కలెక్షన్స్ తో సంచలనం సృష్టించిన తర్వాత రౌడీ బాయ్స్ సినిమా…

కొన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుని రెండో ప్లేస్ లో ఉండగా లిమిటెడ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న హీరో మూవీ జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో పెర్ఫార్మెన్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. కానీ ఈ మూడు సినిమాలలో కూడా ఇప్పుడు హీరో మూవీ…

కలెక్షన్స్ పరంగా చివరి ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా IMDB రేటింగ్ ల ప్రకారం చూసుకుంటే టాప్ లో ఉండగా మిగిలిన సినిమాలు ఈ సినిమా తర్వాత ఉండటం కొంత విస్మయానికి గురి చేస్తుంది అనే చెప్పాలి. బంగార్రాజు సినిమా కి IMDB రేటింగ్ లో 7.74 యావరేజ్ రేటింగ్ సొంతం అవ్వగా రౌడీ బాయ్స్ సినిమా కి 6.3 రేటింగ్ సొంతం అయింది…

కానీ హీరో సినిమా కి మాత్రం ఆశ్యర్యకరంగా ఈ రెండు సినిమాల కన్నా కూడా ఎక్కువగా ఏకంగా 9.0 రేటింగ్ సొంతం చేసుకుని ఈ సంక్రాంతి మూవీస్ లో IMDB రేటింగ్స్ లో టాప్ లో నిలిచింది. ఈ రేటింగ్స్ ని ఈజీగా మ్యానిపులేట్ చేయోచ్చు కానీ పబ్లిసిటీ కోసం ఈ రేటింగ్స్ ని సినిమా వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. బాక్స్ ఆఫీస్ దగ్గర వీక్ గా ఉన్నా ఈ రేటింగ్ లో టాప్ లో ఉంది హీరో మూవీ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here