Home న్యూస్ హీరో టీసర్ 24 గంటల రిపోర్ట్…కొత్త హీరోకి సాలిడ్ రెస్పాన్స్!

హీరో టీసర్ 24 గంటల రిపోర్ట్…కొత్త హీరోకి సాలిడ్ రెస్పాన్స్!

0

టాలీవుడ్ లో స్టార్ కిడ్స్ ఇంట్రో అన్నది సర్వ సాదారణంగా జరుగుతూ వస్తున్నదే… ఇప్పటికే అన్ని ఫ్యామిలీస్ నుండి హీరోలు వస్తూ ఉండగా లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోగ్ గల్లా కూడా హీరోగా లాంచ్ అవ్వడానికి సిద్ధం గా ఉండగా ఎంచుకున్న సినిమా పేరు కూడా “హీరో” అంటూ పెట్టడం తో రొటీన్ కమర్షియల్ లాంచ్ అవుతుందా కొత్త కథతో వస్తాడా అన్న ఆసక్తి…

అందరిలోనూ మొదలు అవ్వగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టైటిల్ అనౌన్స్ మెంట్ మహేష్ బాబు చేతుల మీదుగా జరగగా అదే టైం లో సినిమా ఫస్ట్ టీసర్ ను కూడా రిలీజ్ చేశారు. టీసర్ లో ఫస్ట్ కౌబాయ్ గా ఇంట్రో ఇచ్చిన హీరోని చూస్తె సినిమా కౌబాయ్…

నేపధ్యంలో తెరకెక్కిందా అని అనిపించగా తర్వాత వెంటనే సినిమా షూటింగ్ కోసం జోకర్ వేషం వేసిన హీరో అద్దం ముందు పెర్ఫార్మ్ చేసిన తీరు చూసే సరికి సినిమా చాలా డిఫెరెంట్ గా ఉండబోతుంది అన్న ఫీలింగ్ కలగకమానదు. ఓవరాల్ గా టీసర్ ఫ్రెష్ గా అనిపించగా…

ఎండింగ్ లో జోకర్ బిట్ చూసిన తర్వాత జోకర్ సినిమా పోలికలు ఏమైనా ఉన్నాయేమో అనిపించింది. మొత్తం మీద ఫస్ట్ లుక్ ఇంప్రెషన్ పరంగా పర్వాలేదు అనిపించినా అశోక్ గల్లా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర చేస్తున్నాడు అనిపించింది. ఇక టీసర్ కి ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ లభించింది అని చెప్పాలి. పెద్దగా యాడ్స్ లాంటివి ఏమి వాడకుండానే ఈ టీసర్ కి…

మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 3 మిలియన్స్ వరకు అప్ డేటెడ్ వ్యూస్ దక్కగా రియల్ టైం వ్యూస్ 3.5 మిలియన్స్ దాకా వచ్చాయట. ఇక లైక్స్ పరంగా 30 వేల దాకా లైక్స్ ని 24 గంటల్లో సొంతం చేసుకున్న ఈ టీసర్ సినిమా పై మంచి అంచనాలనే పెంచేలా ఉందని చెప్పాలి. మరి సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here