Home న్యూస్ మురారి రికార్డ్ బ్రేక్ చేసిన ఇంద్ర…అమెరికాలో కుంభస్థలం కొట్టేసింది!!

మురారి రికార్డ్ బ్రేక్ చేసిన ఇంద్ర…అమెరికాలో కుంభస్థలం కొట్టేసింది!!

0

రెండేళ్ళ క్రితం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ బాగా సాగింది, కానీ తర్వాత డోస్ మరీ ఎక్కువ అవ్వడంతో ఈ ట్రెండ్ కి మధ్యలో బ్రేక్ పడినా కూడా తిరిగి రీసెంట్ గా వరుస పెట్టి రీ రిలీజ్ లు మంచి జోరుని బాక్స్ అఫీస్ దగ్గర చూపిస్తూ ఉండగా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇంద్ర(Indra4K Re Release) సినిమా…

భారీగా రీ రిలీజ్ ను సొంతం చేసుకుని మొదటి రోజున 3.05 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…కాగా సినిమా ఇండస్ట్రీ హిట్ మూవీ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ కలెక్షన్స్ ని సీనియర్ హీరోలలో సొంతం చేసుకున్నా కూడా…ఓవరాల్ గా మాత్రం ఇక్కడ…

టాప్ మూవీస్ తో పోల్చితే మంచి జోరు ని చూపించినా కొత్త రికార్డును ఏమి కొట్టలేదు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా అమెరికాలో మాత్రం రీ రిలీజ్ అయిన టాలీవుడ్ మూవీస్ లో ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ తో పాటు టోటల్ కలెక్షన్స్ పరంగా కూడా రికార్డ్ ను నమోదు చేసింది….

అమెరికాలో రీసెంట్ గా మురారి మూవీ ఫస్ట్ 60 వేల డాలర్స్ ను రీ రిలీజ్ మూవీస్ లో అందుకున్న సినిమాగా రికార్డ్ కొట్టగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన ఇంద్ర మూవీ ఏకంగా 62 వేల డాలర్స్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేసింది…

ఒకసారి అమెరికాలో టోటల్ రన్ లో రీ రిలీజ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న మూవీస్ ని గమనిస్తే… 
Tollywood Top Re-Release Movies USA Gross Records
👉#Indra4K – $62,000+*****
👉#Murari4K – $60,144
👉#Simhadri4K – $59,843
👉#ChennaKesavaReddy – $51,129
👉#Jalsa – $37,973
👉#Businessman4K – $27,390
👉#Kushi4K – $24,296
👉#Pokiri – $15,846
👉#Billa – $13,581

మొత్తం మీద ఇంద్ర మూవీ అంచనాలను మించి అమెరికాలో మాస్ రాంపెజ్ ను చూపించి మాస్ రచ్చ చేసింది…ఇక్కడ కొత్త రికార్డులు నమోదు అవ్వకపోయినా కూడా ఓవర్సీస్ లో రికార్డులు నమోదు చేసి బిగ్గెస్ట్ ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక అప్ కమింగ్ మూవీస్ లో ఈ రికార్డ్ ను ఏ సినిమా అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here