Home న్యూస్ ఇంద్రసేనుడి భీభత్సం…1.40 కోట్లతో వీర విహారం!!

ఇంద్రసేనుడి భీభత్సం…1.40 కోట్లతో వీర విహారం!!

0
Indra4K Re Release Advance Bookings Report
Indra4K Re Release Advance Bookings Report

బాక్స్ ఆఫీస్ దగ్గర రీ రిలీజ్ ల ట్రెండ్ కి ఎండ్ కార్డ్ పడింది అనుకుంటే తిరిగి రీసెంట్ గా మురారి సినిమా రీ రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని సొంతం చేసుకోగా ఇప్పుడు సీనియర్ హీరోలలో రికార్డులను సృష్టించడానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పుట్టిన రోజు కానుకగా ఎప్పటి నుండో….

థియేటర్స్ లో చూడాలి అనుకుంటున్న మెగా బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర4K(Indra4K Re Release) సినిమా మాస్ ఊచకోత కోయడానికి సిద్ధం అవుతూ ఉండగా….సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా మొదలు అయ్యి ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతుంది.

సినిమా ఒక్క హైదరాబాదులోనే 55 లక్షలకు పైగా గ్రాస్ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేసింది…ఇక ఆంధ్రలో కూడా బుకింగ్స్ పరంగా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ ఉన్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఇప్పుడు కోటి రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను ఆల్ రెడీ సొంతం చేసుకుని…

టాలీవుడ్ సీనియర్ హీరోలలో బిగ్గెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ ను నమోదు చేయగా టోటల్ ఇండియా ప్రీ బుకింగ్స్ లెక్క 1.1 కోట్లకు పైగా ఉండగా అమెరికాలో కూడా ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న ఇంద్ర మూవీ 20 వేల లోపు బుకింగ్స్ తో రచ్చ చేయగా…UK లో కూడా దుమ్ము లేపుతుంది.

మిగిలిన చోట్ల కూడా రచ్చ చేస్తున్న ఇంద్ర మూవీ వరల్డ్ వైడ్ గా ప్రీ బుకింగ్స్ తో ఇప్పుడు ఓవరాల్ గా 1.40 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ని రిలీజ్ కి ముందే సొంతం చేసుకుని దుమ్ము లేపగా బుక్ మై షోలో సినిమా బుకింగ్స్ కూడా యమ జోరుగా సాగుతూ ఉండగా…

ఓవరాల్ గా హైప్ కి తగ్గట్లు ఇంద్ర మూవీ మాస్ రాంపెజ్ ను చూపెడుతూ మెగాస్టార్ మాస్ జోరుని చూపెడుతుంది…. ఇక ఇదే ఊపు కొనసాగితే సినిమా రీ రిలీజ్ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here