శర్వానంద్, సమంత ల కాంబినేషన్ లో తమిళ్ లో సూపర్ హిట్ అయిన క్లాసిక్ లవ్ స్టోరీ 96 తెలుగు లో జాను పేరుతో రీమేక్ అయ్యి నేడు ప్రేక్షకుల ముందుకు భారీ ఎత్తున వచ్చేసింది. సినిమా వరల్డ్ వైడ్ గా 18.5 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకోగా 19.2 కోట్ల టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాలలో 420 వరకు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా 650 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ..
కథ పాయింట్ కి వస్తే….. 10 వ క్లాస్ లో ప్రేమించుకున్న శర్వానంద్ – సమంతలు కొన్ని కారణాల వల్ల విడిపోగా తిరిగి 17 ఏళ్ల తర్వాత స్కూల్ గెట్ టు గెదర్ లో కలుసుకుంటారు. వాళ్ళు తిరిగి ఏకం అయ్యారా.. లేక ఎవరి లైఫ్ లో వాళ్ళు ముందుకు సాగిపోయారా…
అసలు ఎందుకు విడిపోయారు, క్లైమాక్స్ లో అయినా కలిసారా లేక విడిపోయారా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే…… సమంత శర్వానంద్ లు పోటి పడీ మరీ నటించారు. ముఖ్యంగా సమంత పెర్ఫార్మెన్స్ అదుర్స్ అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఆల్ మోస్ట్ ఏడిపించేసే లెవల్ లో యాక్టింగ్ తో ఆకట్టుకుంది.
మిగిలిన నటీనటుల్లో టీనేజ్ శర్వానంద్ – సమంతలు గా నటించిన వాళ్ళు కూడా అద్బుతంగా నటించి మెప్పిస్తారు. ఇక ఇతర నటీనటులు ఉన్నంతలో ఆకట్టుకోగా సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ప్రాణం. సాంగ్స్ వినడానికి ఎంత బాగుంటాయో…చూడటానికి కూడా అంతే బాగుంటాయి.
ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఆకట్టుకుని ఎక్కడా టెంపో తగ్గకుండా మెప్పిస్తుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మరీ మక్కి కి మక్కి దింపేశారు… ఎక్కడా కొత్తదనం లేదు.. కానీ ఒరిజినల్ చూడని వాళ్లకి పెద్దగా ఇబ్బంది అయితే అనిపించదు.
సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ అద్బుతంగా ఉన్నాయి. ఇక డైరెక్షన్ పరంగా డైరెక్టర్ ఒరిజినల్ ని ఏమాత్రం చెడగొట్టకుండా కొత్తవి యాడ్ చేయకుండా ఒరిజినల్ ఫీల్ ని ఆల్ మోస్ట్ రీ క్రియేట్ చేశాడు. కొంచం లెంత్ తగ్గించి ఉంటె సినిమా బోర్ కొట్టి ఉండేది కాదు.
మొత్తం మీద ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, లీడ్ కాస్ట్ పెర్ఫార్మెన్స్, సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్, ఇంటర్వెల్ సీన్, స్కూల్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్, ఎమోషనల్ క్లైమాక్స్ చాలా బాగున్నాయి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే… సినిమా లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలగడం,
ఫస్టాఫ్ టేక్ ఆఫ్ కి టైం పట్టడం, స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉండటం మేజర్ మైనస్ పాయింట్స్. ఇది క్లాస్ మూవీస్, ప్యూర్ లవ్ స్టోరీస్ ఇష్టపడేవారికి ఓ రేంజ్ లో నచ్చే సినిమా.. కమర్షియల్ ఎలిమెంట్స్, రెగ్యులర్ మూవీ గోర్స్ ఎంతవరకు ఓన్ చేసుకుంటారు అన్న దాని పై సినిమా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ [3/5] స్టార్స్… ఒరిజినల్ 96 మూవీ చూడని వారు కొంచం స్లో నరేషన్ ని తట్టుకుంటే ఈ క్లాస్ లవ్ స్టొరీ ని బాగానే ఎంజాయ్ చేయోచ్చు. ఒరిజినల్ చూసిన వాళ్ళు అన్ని సినిమాలు చూసి ఉంటే గ్యాప్ లో ఈ మూవీ ని ఒక లుక్ వేయొచ్చు.