Home న్యూస్ పోకిరి స్పెషల్ షోల రికార్డ్ బ్రేక్ చేసిన జల్సా….మాస్ రచ్చ!!

పోకిరి స్పెషల్ షోల రికార్డ్ బ్రేక్ చేసిన జల్సా….మాస్ రచ్చ!!

0

రీసెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ మాస్ మూవీ పోకిరి ని 4K లో రీమాస్టర్ వర్షన్ ని రిలీజ్ చేశారు. పుట్టిన రోజు వేడుకల్లో ఈ సినిమా స్పెషల్ షోలకు జనాలు ఓ రేంజ్ లో ఎగబడ్డారు, ఎన్ని సెంటర్స్ లో షోలు అరేంజ్ చేస్తే అన్ని సెంటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.

టోటల్ గా 375 కి పైగా స్పెషల్ షోలను ప్లాన్ చేయగా ఆ స్పెషల్ షోల ద్వారా ఆల్ మోస్ట్ 1.72 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకుని ఇండియన్ సినిమా హిస్టరీలో స్పెషల్ షోలు ఈ రేంజ్ లో పడటమే కాదు…

ఈ రేంజ్ కలెక్షన్స్ ని కూడా అందుకుని కొత్త రికార్డ్ ను పోకిరి సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ రికార్డ్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా 4K లో రీమాస్టర్ వర్షన్ బ్రేక్ చేసి సరికొత్త ఇండియన్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా జల్సాతో పాటు తమ్ముడు కూడా స్పెషల్ షోలు వేయగా జల్సాను స్పెషల్ గా 4K లో రీమాస్టర్ వర్షన్ విత్ ఎక్స్ లెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ తో రెడీ చేయగా షోలు వేస్తూ వెల్లడం అక్కడ రెస్పాన్స్ పెరుగుతూ వెళుతూ ఉండటంతో షోలు పెంచుతూ పెంచుతూ ఇప్పుడు ఏకంగా 560 కి పైగా షోలను ఈ సినిమా కి వేయబోతున్నారు…

ఆల్ మోస్ట్ ఓ కొత్త సినిమాకి పడే రేంజ్ లో షోలు జల్సాకి పడుతూ ఉండగా కొత్తగా యాడ్ చేసిన థియేటర్స్ కాకుండా మిగిలిన థియేటర్స్ లో బుకింగ్స్ నెక్స్ట్ లెవల్ లో రాంపేజ్ ని చూపిస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక స్పెషల్ షోల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here