Home న్యూస్ కోబ్రా ఫస్ట్ డే కలెక్షన్స్….తెలుగు-తమిళ్ లో ఎంత రావొచ్చు!!

కోబ్రా ఫస్ట్ డే కలెక్షన్స్….తెలుగు-తమిళ్ లో ఎంత రావొచ్చు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కోబ్రా పైన ఆడియన్స్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్ టైం లో విక్రమ్ మూవీస్ లో మంచి బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాలలో 4.5 కోట్ల బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ 450 వరకు థియేటర్స్ ని దక్కించుకుని రిలీజ్ అయింది.

ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రిలీజ్ కి ముందు రోజు వరకు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 70 లక్షల లోపు ఉండగా తమిళనాడులో 5.6 కోట్ల రేంజ్ లో అందుకుంది. ఇక సినిమా వినాయక చవితి హాలిడే అడ్వాంటేజ్ తో రిలీజ్ అవ్వగా….

ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించే విధంగా ఉన్నాయి అన్ని చోట్లా కూడా… తెలుగు రాష్ట్రాలలో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే ఓపెన్ అయినా కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు టాక్ ఇంపాక్ట్ వలన స్లో అయింది. అయినా కానీ ఈ రోజు సినిమా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే కనుక…

80 లక్షల నుండి 90 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే 1 కోటి ఆ పైన దాకా వెళ్ళే ఔట్ రైట్ చాన్స్ కొద్ది వరకు ఉండగా తమిళనాడులో 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా అందుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సినిమా…

16 కోట్లకి అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద సినిమా అఫీషియల్ కలెక్షన్స్ ఇప్పుడు ఇదే విధంగా ఉంటాయో ఉండవో చూడాలి, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు నైట్ షోల కలెక్షన్స్ ఎక్కువ ఉంటె ఈ లెక్క ఇంకొంచం పెరగవచ్చు. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here