నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఊహకందని లెవల్ లో భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది, సినిమా మొదటి రోజు ముందు వరకు జరిగిన బుకింగ్స్ తో యావరేజ్ గా 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించవచ్చు అని అంచనా వేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు సినిమా అద్బుతంగా హోల్డ్ చేసి అంచనాలను మించే విధంగా జోరు చూపింది.
దాంతో మొదటి రోజు లెక్క ఇప్పుడు 5 నుండి 6 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ని బట్టి ఈ లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుంది అని చెప్పాలి.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా… సినిమా మొత్తం మీద మొదటి రోజు ట్రేడ్ అంచనాలను మించి కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపింది, ఇక అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.