Home గాసిప్స్ నిజమా…కాదా…టాలీవుడ్ మొత్తం షాకులో ఉంది!!

నిజమా…కాదా…టాలీవుడ్ మొత్తం షాకులో ఉంది!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్మూడేళ్ళుగా ఆర్ ఆర్ ఆర్ కే ఫిక్స్ అయ్యి ఉన్నాడు, టెంపర్ తర్వాత వరుస పెట్టి సినిమాలతో జోరు చూపిన ఎన్టీఆర్ తర్వాత నాన్ స్టాప్ 5 సినిమాలతో రచ్చ చేసినా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కోసం ఫ్యాన్స్ మూడేళ్ళుగా ఎదురు చూసేలా చేయగా, తన అప్ కమింగ్ మూవీస్ విషయం లో పక్కా ప్లానింగ్ తో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు అప్ కమింగ్ మూవీస్ లో మరో ఇండస్ట్రీ డైరెక్టర్ ను కూడా సెట్ చేయబోతున్నాడు అన్నది లేటెస్ట్ టాక్…

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తో బిజీ గా ఉండగా ఈ సినిమా తర్వాత తనకి జనతా గ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ తో తర్వాత సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే, ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరో పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ ఉండగా…

ఇక్కడి వరకు ప్రాజెక్టులని ఎన్టీఆర్ రీసెంట్ గా కన్ఫాం చేశాడు, ఇక తర్వాత ప్రాజెక్టులు ఏంటి అనేది త్వరలో కన్ఫాం కానుండగా కోలివుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉండగా ఆ సినిమా మొదలు అవ్వడానికి ఇంకా టైం పట్టేలా ఉండగా ఇంతలో బాలీవుడ్ నుండి కూడా ఎన్టీఆర్ కి ఆఫర్స్ వస్తున్నాయట.

ఇక వీళ్ళ తో పాటు ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పేరు కూడా వినిపిస్తుంది. బాలీవుడ్ లో రాజమౌళి రేంజ్ లో భారీ సెట్టింగ్స్ లో హిస్టారికల్ మూవీస్ చేయగల డైరెక్టర్ గా పేరున్న అశుతోష్ గోవారికర్ ప్రస్తుతం కొత్త సినిమాలు ఏవి మొదలు పెట్టలేదు, కథలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్న ఈయన…రీసెంట్ టైం లో పెద్దగా ఫాం లో కూడా లేడు…

అప్పుడెప్పుడో జోదా అక్బర్ తప్ప మరో క్రేజీ హిట్ అయితే దక్కలేదు కానీ బారీ విజువల్ వండర్స్ తీయగల డైరెక్టర్ గా పేరున్న ఈ డైరెక్టర్ తన కొత్త సినిమా కోసం ఎన్టీఆర్ ని కూడా కన్సిడర్ చేస్తున్నారు అన్నది లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్, ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది…. ఇది రూమర్ గానే ఉంటుందా లేక మెటీరియలైజ్ అయ్యే ఛాన్స్ ఉందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here