2018 ఇయర్ ని ఒకసారి పరిశీలిస్తే మొదలు అవ్వడం స్లో గా మొదలు అయినా కానీ సమ్మర్ రేసులో నిలిచిన కొన్ని సినిమాలు అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించి మొదటి అర్ధభాగాన్ని నిలబెట్టాయి. ఇక సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ అయిన సినిమాలలో RX100 మాత్రమె ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇప్పటి వరకు…
ఇక్కడ మరో విచిత్రం ఏంటి అంటే టాలీవుడ్ లో గత రెండు నెలలుగా చూసుకుంటే ఒక్క తెలుగు సినిమా కూడా 10 కోట్ల మార్క్ ని క్రాస్ చేయలేదు…జూన్ లో వచ్చిన సినిమాలన్నీ చేతులు ఎత్తేయగా డబ్బింగ్ మూవీ అభిమన్యుడు 9.2 కోట్ల షేర్ ని అందుకుంది.
ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలలో ఒక్క RX100 మాత్రమే 10 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది…ఇక జులై చివర్లో సాక్ష్యం భారీ గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కూడా మంచి వసూళ్లు కురిపించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.