దీపావళి వీకెండ్ లో కలెక్షన్స్ పరంగా వీర విహారం చేసిన కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క(Ka Movie), దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) లక్కీ భాస్కర్(Lucky Baskhar) మరియు శివ కార్తికేయన్(Siva Kartikeyan) అమరన్(Amaran) సినిమాలు ఇప్పుడు అన్నీ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయ్యాయి….
5వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని సినిమాలు వేటి రేంజ్ లో అవి బాగానే జోరు చూపించి హోల్డ్ చేయగా అమరన్ మూవీ మిగిలిన సినిమాలను డామినేట్ చేసే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంది…ఇక అన్ని సినిమాలు ఇప్పుడు 6వ రోజున మరోసారి వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా…
వేటి రేంజ్ లో అవి బాగానే బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం…క మూవీ 6వ రోజు మరోసారి మాస్ సెంటర్స్ లో మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా 5వ రోజుతో పోల్చితే లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ రన్ ని కొనసాగిస్తుంది..
దాంతో సినిమా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 75-80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరగవచ్చు…ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మరోసారి కోటి కి పైగా షేర్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక లక్కీ భాస్కర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి పర్వాలేదు అనిపిస్తూ జోరు చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు సినిమా 80-85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 4 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోవచ్చు…
ఇక అమరన్ మూవీ మరోసారి అన్ని సినిమాలను డామినేట్ చేస్తూ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కోటికి పైగా షేర్ ని అందుకునీ అవకాశం ఉండగా, ఈ సినిమా తమిళనాడులో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా….
మిగిలిన చోట్ల కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతుంది. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా 12-13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఉన్నంతలో అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపెడుతున్నాయి. ఇక సినిమాలు అన్నీ అఫీషియల్ గా 6 రోజులకు సాధించే అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.