Home న్యూస్ కబ్జా రివ్యూ రేటింగ్….హిట్టా-ఫట్టా!

కబ్జా రివ్యూ రేటింగ్….హిట్టా-ఫట్టా!

0

కేజిఎఫ్ సిరీస్, కాంతార సినిమాలతో కన్నడ నుండి వస్తున్న సినిమాలు అంటే ఇతర ఇండస్ట్రీలో ఆసక్తి పెరిగిపోయింది. ఇలాంటి టైంలో కేజిఎఫ్ సిరీస్ ను పోలి ఉన్న సినిమాగా అనిపించినా కబ్జా భారీ బడ్జెట్ తో భారీ లెవల్ లో రిలీజ్ అయింది. పెద్దగా బజ్ అయితే సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా మౌత్ టాక్ నే నమ్ముకుని ఆడియన్స్ ముందుకు రాగా ఎంతవరకు అంచనాలను అందుకుంది, ఎంతవరకు మెప్పించింది అన్నది తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…. 1945-1975 కాలంలో ఈ సినిమా కథ జరుగుతుంది…. 

స్వాతంత్ర్య పోరాటంలో తండ్రిని కోల్పోయిన హీరో పైలట్ అవ్వాలని అనుకుంటాడు, చాలా సౌమ్యుడు అయిన హీరోకి ఒక అన్న… ఇక అమలాపురం యువరాణి అయిన హీరోయిన్ శ్రీయ… హీరోని హీరోయిన్ ఇష్టపడుతుంది… అనుకోని పరిస్థితులలో హీరో అన్న చనిపోయిన తర్వాత హీరో కత్తి పట్టాల్సి వస్తుంది. చాలా సౌమ్యుడు అయిన హీరో ఎలా ఓ మాఫియా డాన్ గా మారాడు అన్నది సినిమా ఓవరాల్ స్టొరీ పాయింట్….

సినిమా మొత్తం మీద కథ చాలా రొటీన్ గా ఉండగా అప్పుడెప్పుడో వచ్చిన భాషా నుండి కేజిఎఫ్ సిరీస్ దాకా ఇలాంటి కథలు ఎన్నో ఎన్నోన్నో చూశాం, కానీ కేజిఎఫ్ ని ఆడియన్స్ మెచ్చడానికి ఎలివేషన్స్, మాస్ మూమెంట్స్, హీరోయిజం, టేకింగ్ ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. అవే ఇక్కడ కూడా రిపీట్ చేస్తే సరిపోతుంది అనుకున్నట్లు టీం ప్రతీ సీన్ లో కేజిఎఫ్ ను గుర్తు చేస్తూనే ఉండటంతో… ఆడియన్స్ కి కేజిఎఫ్ సినిమానే ఎక్కువగా గుర్తు వస్తూ ఉంటుంది.

కథలో అక్కడక్కడా కొన్ని ఆసక్తిని కలిగించే సీన్స్ వచ్చినా అవి పెద్దగా ఇంపాక్ట్ ఫుల్ గా లేక పోవడం, ఫస్టాఫ్ కే ఆడియన్స్ కి చాలా నీరసం రావడం ఖాయం, కొంచం బెటర్ గా సెకెండ్ ఆఫ్ ఉన్నప్పటికీ మంచి ఆసక్తిని కలిగించేలా క్లైమాక్స్ రన్ అవుతున్న టైంలో సినిమా మిగిలిన కథ పార్ట్ 2 లో చూడండి అంటూ ఎండ్ చేసిన విధానం నిరాశ పరుస్తుంది… ఉపేంద్ర ఎప్పటిలానే బాగా మెప్పించగా శ్రీయ కూడా ఆకట్టుకుంటుంది, కిచ్చ సుదీప్ పోలిస్ రో మెప్పించగా స్పెషల్ గెస్ట్ రోల్ లో శివరాజ్ కుమార్ కూడా ఆకట్టుకుంటారు…

సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ కంప్లీట్ గా కేజిఎఫ్ ను గుర్తు చేయగా, డైరెక్షన్, కెమరా వర్క్, ఎడిటింగ్ ఇలా అన్నీ కూడా కేజిఎఫ్ నే గుర్తు చేస్తూ ఉంటాయి. దాంతో పార్టు పార్టులుగా ఎదో ఓకే అనిపించినా కానీ కేజిఎఫ్ దరిదాపుల్లోకి కూడా ఈ సినిమా వెళ్ళలేదు అని చెప్పొచ్చు… చాలా ఓపిక చేసుకుని కూర్చుంటే తప్పితే సినిమా మెప్పించే అవకాశం చాలా తక్కువ… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here