బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ భారీ లెవల్ లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయిన పెద్ద సినిమా కబ్జా…. కేజిఎఫ్ సినిమాకి సస్తా కాపీలా వచ్చిన ఈ సినిమా ఏ దశలో కూడా కేజిఎఫ్ దరిదాపుల్లోకి రాలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా త్వరగానే పరుగును పూర్తీ చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా బడ్జెట్ దృశ్యా చెప్పాలి అంటే…
ఎపిక్ డిసాస్టర్ మూవీ గా నిలిచింది అని చెప్పాలి. అలాంటి సినిమా టోటల్ రన్ లో 115 కోట్ల బడ్జెట్ మీద 15 కోట్లు కూడా రికవరీని థియేటర్స్ నుండి సొంతం చేసుకోలేక పోయిన ఈ సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది…
సినిమా కోసం భారీ రేటుని చెల్లించి డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్లో సినిమాను రీసెంట్ గా రిలీజ్ చేయగా ఆడియన్స్ కేజిఎఫ్ తో కంపేర్ చేయడంతో థియేటర్స్ లో చూడలేక పోయిన వాళ్ళు ఇక్కడ డిజిటల్ లో చూడటానికి ఎగబడ్డారు అని చెప్పాలి….
దాంతో సినిమా డిజిటల్ వ్యూవర్ షిప్ ఎక్స్ లెంట్ గా ఉండగా ఇక్కడ వ్యూస్ సాలిడ్ గానే సొంతం చేసుకుంటూ అమెజాన ప్రైమ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా కానీ ఇక్కడ మాత్రం సాలిడ్ గానే వ్యూవర్ షిప్ ను సినిమా సొంతం చేసుకుంటుంది అని చెప్పాలి.