Home న్యూస్ నేపాల్ లో కల్కి ఇండస్ట్రీ రికార్డ్…బాహుబలి2 ఔట్ అక్కడా!

నేపాల్ లో కల్కి ఇండస్ట్రీ రికార్డ్…బాహుబలి2 ఔట్ అక్కడా!

0
Kalki 2898 AD Movie Crosses Baahubali2 Collections in Nepal Country
Kalki 2898 AD Movie Crosses Baahubali2 Collections in Nepal Country

అన్ సీజన్ లో ఎలాంటి పండగ అడ్వాంటేజ్ లు లేకుండా రిలీజ్ అయ్యి అల్టిమేట్ పాజిటివ్ టాక్ బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన కల్కి మూవీ(Kalki 2898 AD) సౌత్ టు నార్త్ అండ్ ఓవర్సీస్ అన్ని చోట్లా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…సినిమా ఊరమాస్ లాంగ్ రన్ ను దక్కించుకుని దుమ్ము లేపగా రిలీజ్ అయ్యి 5వ వారంలో ఉన్నా కూడా…

ఇప్పటికీ షేర్స్ ను సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తున్న కల్కి మూవీ ఇండియాలోనే కాకుండా నేపాల్ లాంటి చిన్న దేశంలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా అక్కడ ఇప్పుడు టోటల్ రన్ లో ట్రేడ్ లెక్కల్లో కొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది. అక్కడ ఇది వరకు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న…

Kalki 2898 AD 29 Days Total World Wide Collections!!

ఇండియన్ మూవీగా బాహుబలి2(Baahubali2 Movie) రికార్డ్ ను సృష్టించగా ఆల్ మోస్ట్ 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు కల్కి మూవీ ఆ రికార్డ్ కలెక్షన్స్ ని దాటేసింది….అప్పట్లోనే బాహుబలి2 మూవీ ట్రేడ్ లెక్కల్లో ఆల్ మోస్ట్ 23 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని నేపాల్ లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…

తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా బాహుబలి2 ని అందుకోలేక పోయింది. కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న కల్కి మూవీ 5వ వారంలో కూడా కలెక్షన్స్ ని సాధిస్తూ అక్కడ 23 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసి ఇప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ…

పరుగును కొనసాగిస్తూ ఉండగా అక్కడ ఇండియన్ మూవీస్ లో సరికొత్త ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది. దాంతో నేపాల్ లో 2 ఇండస్ట్రీ రికార్డ్ మూవీస్ ప్రభాస్ ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉండగా ఇక మిగిలిన రన్ లో కల్కి ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.

Kalki 2898 AD 4 Weeks (28 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here