కెరీర్ ని ఫ్లాఫ్ తో మొదలు పెట్టినా అతనొక్కడే సినిమా తో సూపర్ సక్సెస్ ను దక్కించుకుని ఇక వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస పెట్టి ఆఫర్స్ ను సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ ఆ ఆఫర్స్ ద్వారా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ లను అయితే సాధించలేక పోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రయోగాలు చేసినా మంచి పేరు అయితే వచ్చింది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయితే…
రాని టైం లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేసిన పటాస్ సినిమాతో 6 ఏళ్ల క్రితం సూపర్ సక్సెస్ ను సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్ 16 కోట్లకు పైగా షేర్ ని సాధించి సత్తా చాటుకోగా మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ పడుతున్న వేల 118 సినిమాతో మరో సక్సెస్ ను…
సొంతం చేసుకున్నా తర్వాత చేసిన ఎంతమంచివాడవురా భారీ డిసాస్టర్ అయింది. ఇలాంటి టైం లో మళ్ళీ స్క్రిప్ట్ పైన దృష్టి పెట్టిన కళ్యాణ్ రామ్ అప్ కమింగ్ మూవీస్ విషయం లో మరింత శ్రద్ధ తీసుకుంటూ ఉండగా లేటెస్ట్ గా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ ని అనౌన్స్ చేశాడు.
భారీ బడ్జెట్ తో మైతలాజికల్ సబ్జెక్ట్ ను ఎంచుకుని బింబిసర టైటిల్ తో తెరకెక్కిస్తున్న అన్ సంగ్ స్టొరీ ఫస్ట్ లుక్ టైటిల్ అనౌన్స్ మెంట్ ని రీసెంట్ గా రివీల్ చేయగా రెస్పాన్స్ అయితే సాలిడ్ గా వచ్చింది. ఇక సినిమా బడ్జెట్ లెక్కలు కూడా ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుండగా ఈ సినిమా కోసం ఏకంగా 45 కోట్ల రేంజ్ లో…
బడ్జెట్ ని అనుకుంటున్నారని అంటున్నారు ఇప్పుడు. కళ్యాణ్ రామ్ మార్కెట్ కి ఇది ఆల్ మోస్ట్ ప్రజెంట్ రెండు రెట్లు ఎక్కువే అని చెప్పాలి. కానీ సినిమా కథ పై నమ్మకంతో ఈ రేంజ్ బడ్జెట్ ని పెట్టడం కన్ఫాం అయినట్లే అని కుదిరితే ఇతర భాషల్లో కూడా డబ్ చేయడం ఖాయమని అంటున్నారు. మరి ఈ సినిమా తో కళ్యాణ్ రామ్ కెరీర్ భారీ టర్న్ తీసుకుంటుందో లేదో చూడాలి.