Home న్యూస్ కమల్ హాసన్ విక్రమ్ తెలుగు డబ్ రేటు ఎంత పలికిందంటే!!

కమల్ హాసన్ విక్రమ్ తెలుగు డబ్ రేటు ఎంత పలికిందంటే!!

0

కోలివుడ్ సీనియర్ హీరోల్లో రీసెంట్ టైం లో పెద్దగా ఫామ్ లో లేని హీరో కమల్ హాసన్ అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర కమల్ హాసన్ నటించిన సినిమాల్లో విశ్వరూపం ఒక్కటే సంచలనం సృష్టించగా తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా ఆకట్టుకోలేక పోయింది. విశ్వరూపం2 సైతం నిరాశ పరచగా రీసెంట్ టైం లో సాలిడ్ బజ్ ను సొంతం చేసుకున్న సినిమా గా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్…

చేస్తున్న లేటెస్ట్ మూవీ విక్రమ్ నిలిచింది అని చెప్పాలి….. ఒక్క తమిళ్ అనే కాదు సౌత్ భాషలు అన్నింటిలో కూడా ఎక్స్ లెంట్ బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు లో భారీ పోటి నడుమ రిలీజ్ అవుతూ ఉన్నప్పటికీ కూడా మంచి బిజినెస్ నే సొంతం చేసుకుందని సమాచారం…

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల రైట్స్ ని యంగ్ హీరో నితిన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం, కాగా రైట్స్ 7 కోట్ల రేంజ్ లో ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఎఫ్ 3, తర్వాత మేజర్ రిలీజ్ లు ఉండగా విక్రమ్ కూడా మేజర్ తో వస్తున్నా 7 కోట్ల రేటు సొంతం చేసుకున్నా హిట్ టాక్ వస్తే ఈ అమౌంట్ ని రికవరీ చేయడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here