లారెన్స్ హీరోగా డైరెక్టర్ గా తెరకెక్కించిన సినిమాల్లో ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్న సినిమాలు కాంచన సిరీస్, ముని గా మొదలైన ఈ సినిమా తర్వాత గంగ ఆ తర్వాత కాంచన గా మారగా ఇప్పుడు ఓవరాల్ గా ఈ సిరిస్ లో కొత్త సినిమా కి కాంచన 3 అని పెట్టగా సినిమా భారీ ఎత్తున నేడు రిలీజ్ అయింది, కాగా సినిమా కథ పాయింట్ మాత్రం చాలా రొటీన్…
హర్రర్ కామేడి మూవీస్ లో ఉండే కథే… అందుకే ఆ కథ ని మళ్ళీ చెప్పడం లేదు, కానీ రొటీన్ కథ ని కూడా 2 గంటల 40 నిమిషాలకు పైగా థియేటర్స్ లో కూర్చుని ఎంజాయ్ చేసే విధంగా లారెన్స్ సినిమాను రూపించి మెప్పించాడు. హర్రర్ కి హర్రర్ కామెడి కి కామెడి తో…
కాంచన 3ప్రేక్షకులను చాలా వరకు మెప్పిస్తుంది, సినిమా అంతా ఆకట్టుకున్నా సాంగ్స్ అలాగే కొన్ని సిల్లీ సీన్స్ సినిమాలో మైనస్ గా మారాయి. అవి పక్కకు పెడితే కాంచన 3 రాఘవ లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన ఇతర కాంచన సిరిస్ కి ఏమాత్రం తీసిపోని సినిమా.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో తన మార్క్ ఎమోషనల్ టచ్ తో మరోసారి లారెన్స్ అదరగొట్టేశాడు. ఫస్టాఫ్ కామెడీ అండ్ హర్రర్ తో సాగగా సెకెండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్ సీన్స్ మరోసారి ఆకట్టుకుంటాయి. కానీ VFX మాత్రం యావరేజ్ గా ఉన్నాయి. బ్యాగ్రౌన్స్ స్కోర్ బాగుంది.
ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేది. ఓవరాల్ గా కాంచన లో మైనస్ లు ఉన్నా రొటీన్ కథనే అయినా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సఫలం అయ్యింది, సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్… ఇక కమర్షియల్ గా ఎలాంటి సక్సెస్ ని సినిమా సొంతం చేసుకుంటుందో చూడాలి.