జెర్సీ డే 4 అండ్ కాంచన3 డే 4 కలెక్షన్స్…రెండూ కుమ్మేశాయి!!

0
379

  సమ్మర్ న్యూ మూవీస్ జెర్సీ మరియు కాంచన 3 రెండు సినిమాలు తొలి వీకెండ్ ని ఘనంగా ముగించగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్ళతో దూసుకు పోతున్నాయి. ముందుగా జెర్సీ సినిమా వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సాధించి అంచనాలను మించగా 4 వ రోజు వర్కింగ్ డే అయినా కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 2.5 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సత్తా చాటింది.

టోటల్ గా 4 రోజులకు గాను సినిమా రెండు రాష్ట్రాలలో 13.69 కోట్ల షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 4 రోజుల్లో 20.34 కోట్ల షేర్ ని అందుకుంది, టోటల్ గ్రాస్ 37.5 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 6.7 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.

ఇక మరో సినిమా కాంచన 3 4 వ రోజున రెండు రాష్ట్రాలలో 1.85 కోట్ల షేర్ ని సాధించి దుమ్ము లేపింది, దాంతో 4 రోజుల్లో రెండు రాష్ట్రాలలో 11 కోట్ల షేర్ ని అందుకుని బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుంది, ఇక ఈ రోజు నుండి సాధించే కలెక్షన్స్ అన్నీ లాభాల కిందే లెక్క అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!