Home న్యూస్ ఒక్క సాంగ్ తో హైప్ పెంచేసిన మంచు విష్ణు…కన్నప్ప ఫస్ట్ సాంగ్ కుమ్మింది!!

ఒక్క సాంగ్ తో హైప్ పెంచేసిన మంచు విష్ణు…కన్నప్ప ఫస్ట్ సాంగ్ కుమ్మింది!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో మంచు విష్ణు(Manchu Vishnu) కూడా ఒకరు….కెరీర్ లో సాలిడ్ కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న తరుణంలో ఇప్పుడు తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) మూవీ ఈ సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉండగా…అన్ని ఇండస్ట్రీల నుండి…

భారీ స్టార్ కాస్ట్ తో రూపొందుతూ ఉండటంతో అంచనాలు పెరిగిపోయినప్పటికీ కూడా సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ అయిన తర్వాత హైప్ పెరగాల్సింది పోయి భారీ ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది….తర్వాత అప్పుడప్పుడు సినిమా లో నటించిన యాక్టర్స్ పోస్టర్స్ రిలీజ్ అవ్వడం..

అవి కూడా ట్రోల్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది…ఇలాంటి టైంలో సినిమా నుండి ఇప్పుడు ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు….శివ శివ శంకర(Shiva Shiva Shankaraa Lyrical Video) లిరిక్స్ తో రూపొందిన ఈ సాంగ్ మీద రిలీజ్ కి ముందు పెద్దగా ఏమి హైప్ అయితే లేదని చెప్పాలి….

కానీ సినిమా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ట్రోల్ స్టఫ్ అవుతుంది ఏమో అని అనుకున్న వాళ్ళకి షాకిస్తూ ఫస్ట్ టైం విన్నప్పుడే చాలా బాగుంది అనిపించేలా మెప్పించింది, దానికి మించి లిరికల్ సాంగ్ లో కొంచం ఎక్కువగానే విజువల్స్ ని చూపించగా…చాలా రిచ్ గా ఎక్స్ లెంట్ క్వాలిటీ తో విజువల్స్ బాగా మెప్పించాయి…

ఇక అన్నింటికీ మించి రీసెంట్ టైంలో ఎక్కువగా ట్రోల్స్ ని ఫేస్ చేసిన విష్ణు సాంగ్ లో యాక్టింగ్ పరంగా బాగా నటించినట్లు అనిపించడం విశేషం అని చెప్పాలి… ఓవరాల్ గా సాంగ్ రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ లేనట్టే అనిపించినా కూడా ఇప్పుడు….

సాంగ్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా సినిమా మీద పాజిటివ్ నెస్ అయితే పెరిగింది అని చెప్పాలి. ఇక సినిమా నుండి వచ్చే ఇతర కంటెంట్ కూడా ఇదే విధంగా మెప్పిస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నప్ప ఆశ్యర్య పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here