Home న్యూస్ దేవ్ ఫస్ట్ డే కలెక్షన్స్…షాకింగ్!

దేవ్ ఫస్ట్ డే కలెక్షన్స్…షాకింగ్!

0

     కోలివుడ్ స్టార్ హీరో కార్తీ రెండు వరుస విజయాల తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ దేవ్. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆటకే మిశ్రమ స్పందన ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ గట్టిగానే పడింది అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అఫీషియల్ గా తెలుగు వర్షన్ 6.4 కోట్లు, తమిళ్ వర్షన్ 22 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకుంది.

టోటల్ గా 28.4 కోట్ల బిజినెస్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 29.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేవనే చెప్పాలి. తమిళనాడు లో 3.31 కోట్ల గ్రాస్ ని అందుకున్న ఈ సినిమా…

తెలుగు లో 1.2 కోట్ల గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 55 లక్షల గ్రాస్ ని ఓవర్సీస్ లో 64 లక్షల దాకా గ్రాస్ ని అందుకుంది. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా 5.72 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకోగా షేర్ అటూ ఇటూ గా 3 కోట్ల దాకా ఉంటుందని సమాచారం.

అందులో తెలుగు వర్షన్ 6.4 కోట్ల బిజినెస్ కి మొదటి రోజు 80 లక్షల దాకా షేర్ ని సినిమా సాధించింది. ఇక బిజినెస్ ని అందుకోవడానికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ వరకు భారీ గ్రోత్ ని చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

తమిళ్ వర్షన్ తో పోల్చితే కొంచం లిమిటెడ్ గా రిలీజ్ అయినా తెలుగు వర్షన్ బెటర్ గా కలెక్షన్స్ రావడం విశేషం. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 26.5 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here