బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాలను క్రియేట్ చేసి మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న కార్తి నటించిన లేటెస్ట్ మూవీ సుల్తాన్, టీసర్ ట్రైలర్ తో మంచి ఇంప్రెషన్ ను సాధించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వగా సినిమా ఓపెనింగ్స్ బాగానే వచ్చినా కానీ తర్వాత రన్ స్లో అయ్యి సెకెండ్ వీక్ లో వకీల్ సాబ్ సినిమా రిలీజ్ ఉండటం తో…
పరుగును త్వరగానే ముగించి హిట్ అవ్వాల్సిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ గా నిలిచింది, ఇలాంటి టైం లో కార్తి సినిమా పరంగా ఇంప్రెస్ చేసినా కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేక పోయాడు. ఇప్పుడు కార్తీ సర్దార్ అనే కొత్త సినిమా చేస్తుండగా….
రీసెంట్ గా సినిమా ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు… ఇక ఈ సినిమా తో పాటు మరో రెండు కొత్త సినిమాలను కూడా కార్తీ కమిట్ అయ్యాడు అంటూ ఇప్పుడు టాక్ గట్టిగానే వినిపిస్తుంది, కెరీర్ లో కరెక్ట్ టైం లో మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ఖాకీ మరియు ఖైదీ సినిమాల…
సీక్వెల్ కథలు కూడా ఆల్ మోస్ట్ సిద్ధంగా ఉన్నాయని అంటున్నారు, కథలకు తుది మెరుగులు దిద్దుతున్నారని, త్వరలోనే సీక్వెల్ కథలు కంప్లీట్ గ సిద్ధం అవుతాయని, కార్తీ వాటిని విని ఓకే చెప్పడం ఒక్కటే బాలెన్స్ ఉంటుందని కోలివుడ్ లో చెబుతున్నారు. ఖాకీ మరియు ఖైదీ రెండూ వేటికవే డిఫెరెంట్ జానర్ మూవీస్ అయినప్పటికీ కూడా ఆడియన్స్ రెండు సినిమాలను అటు తమిళ్ లో ఇటు తెలుగు లో…
బాగా ఆదరించి విజయాన్ని అందించారు. రెండూ కూడా వాటి వాటి రిలీజ్ టైం లో కార్తీ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ను సాధించిన సినిమాలుగా నిలిచాయి. మరి ఇప్పుడు సర్దార్ తర్వాత బాక్ టు బాక్ ఈ రెండు సీక్వెల్స్ అంచనాలకు తగ్గట్లు రూపొండితే కచ్చితంగా కార్తీ కెరీర్ లో మరో బిగ్ స్టెప్ వేయడానికి ఉపయోగ పడే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.