కరోనా ఎఫెక్ట్ వలన థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేసే పరిస్థితులు లేవు, దాంతో చాలా సినిమా లు థియేటర్స్ కోసం ఎదురు చూసి చూసి అది కుదరక ఇక OTT ఆఫర్స్ లో తమ కి బెటర్ అనిపించిన ఆఫర్ ని ఓకే చేసి సినిమాలను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన డిజిటల్ రిలీజ్ లలో యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా ఒక్కటే…
అది రీసెంట్ గా రిలీజ్ అయిన కృష్ణ అండ్ హిస్ లీల సినిమా కాగా ఓవరాల్ గా డిజిటల్ రిలీజ్ లు మొదలు అయ్యాక రిలీజ్ అయిన సినిమాల్లో హైయెస్ట్ రేటు పలికిన సినిమా ఆయుష్మాన్ ఖురానా మరియు అమితాబ్ ల కాంబినేషన్ లో….
తెరకెక్కిన గులాబో సితాబో సినిమా… ఈ సినిమా కి ఏకంగా 63 కోట్ల రేటు దక్కగా ఇదే OTT లో రిలీజ్ అయిన సినిమాల్లో హైయెస్ట్ రేటు దక్కించుకున్న సినిమా గా నిలిచింది. కానీ సినిమా టాక్ డిసాస్టర్ రేంజ్ కన్నా తక్కువగా ఉండగా… పెట్టిన రేటు కి ఏమాత్రం న్యాయం చేయలేక పోయింది.
అదే సమయం లో కేవలం 7.5 కోట్ల రేటు ఆఫర్ దక్కించుకున్న కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ సినిమా మిక్సుడ్ టాక్ నే సొంతం చేసుకున్నా కానీ OTT లో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకి ఎక్కువ మంది చూసిన గా అలాగే నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతున్న సినిమా అని చెబుతున్నారు. హిందీ కి నేషనల్ వైడ్ ఆడియన్స్ ఉన్నా కానీ…
పెంగ్విన్ సినిమా ను సబ్ టైటిల్స్ లో చూసి ఇండియా వైడ్ గా కూడా సినిమా కి భారీ వ్యూస్ దక్కుతున్నాయని అంటున్నారు. దాంతో నిర్మాతకి ఇప్పుడు వ్యూస్ ప్రకారం కూడా డబ్బులు దక్కుతుండటం తో అందరూ 63 కోట్ల రేటు పెట్టిన సినిమా చేయలేని పని ఇప్పుడు 7.5 కోట్ల రేటు తో కొన్న సినిమా చేస్తుందని అంటున్నారు…