Home న్యూస్ 185-8.2….ఇండియన్ సినిమా చరిత్రలో భీభత్సం ఇదీ!!

185-8.2….ఇండియన్ సినిమా చరిత్రలో భీభత్సం ఇదీ!!

0

ఇండియన్ సినిమా హిస్టరీ లో అనేక సినిమాలు ఇప్పటికే వచ్చాయి, ఇక మీదట కూడా లెక్కకు మిక్కిలి అనేక సినిమాలు వస్తాయి, కానీ వాటిలో ఏ సినిమా కూడా అందుకోలేని ఊహకందని రికార్డులను నమోదు చేసిన సినిమా గా KGF సినిమా నిలుస్తుంది… సౌత్ లో అతి తక్కువ మార్కెట్ ఉన్న కన్నడ ఇండస్ట్రీ తరుపున ఆల్ టైం ఎపిక్ రికార్డులతో ఇండియా లో ఇప్పుడు కన్నడ మూవీస్ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయ్యేలా చేసిన…

KGF సినిమా మొదటి పార్ట్ సాధించిన అల్టిమేట్ విజయం తర్వాత వస్తున్న రెండో పార్ట్ కోసం ప్రతీ ఒక్కరు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా సినిమా సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ ఇయర్ మొదట్లో యష్ పుట్టిన రోజు…

కానుకగా రిలీజ్ చేసిన KGF 2 టీసర్ మైండ్ బ్లోయింగ్ రికార్డులతో చరిత్ర సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఇండియన్ సినిమా హిస్టరీ లోనే హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ టీసర్ లైక్స్ పరంగా వరల్డ్ రికార్డ్ ను సాధించింది, వ్యూస్ పరంగా కూడా వరల్డ్ రికార్డ్ కొట్టింది…

ఇప్పటికీ సంచలన వ్యూస్ తో దూసుకు పోతున్న ఈ టీసర్ రీసెంట్ గా 185 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని మరో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయగా లైక్స్ ఏకంగా 8.2 మిలియన్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఈ రికార్డులు ఫ్యూచర్ లో కూడా అందుకోవాలి అంటే చాలా చాలా కష్టం అనే చెప్పాలి. ఈ రేంజ్ లో రికార్డులు సాధించిన ఈ టీసర్…

సినిమా పై ఉన్న అంచనాలను ఓ రేంజ్ లో పెరిగేలా చేసిన ఈ సినిమా టీసర్ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసింది. సినిమా వచ్చే టైం కి ఈ టీసర్ మరిన్ని అద్బుతాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది… సినిమా వచ్చాక క్రేజ్ ని బట్టి 200 మిలియన్ ని అందుకున్నా ఆశ్యర్యపోనవసరం లేదని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here