Home న్యూస్ KGF చాప్టర్ 2 రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

KGF చాప్టర్ 2 రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

2018 లో వచ్చిన కేజిఎఫ్ సంచలన విజయం తర్వాత పార్ట్ 2 పై అంచనాలు పెరిగి పోగా సినిమా రిలీజ్ వేవ్ ల వలన ఆలస్యం అయినా కానీ ఆడియన్స్ లో క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు… ఆ క్రేజ్ వలనే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 10 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా భారీగా అంచనాలు పెట్టుకున్న ఆడియన్స్ అంచనాలను అందుకుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది… మరి ఆ అంచనాలను అందుకుందో లేదో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే కేజిఎఫ్ ని సొంతం చేసుకున్న హీరో కి అధీర నుండి అలాగే ఇండియన్ గవర్నమెంట్ నుండి పెద్ద సవాళ్లు ఎదురు అవుతాయి. వాటిని తట్టుకుని హీరో ఏం చేశాడు అన్నది ఈ రెండో పార్ట్ స్టొరీ లైన్….కథ పరంగా ఈ పార్ట్ 2 లో కూడా ఏమి స్టొరీ లేదు…. ఫస్ట్ పార్ట్ కూడా కథ పరంగా ఏమి ఉండదు, కేవలం ఎలివేషన్ సీన్స్ అండ్ కొన్ని ఎమోషన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడంతో ఆ సినిమా ఊహకందని విజయాన్ని సొంతం అయ్యేలా చేసింది. ఇక్కడ కూడా ఎమోషన్స్ మరీ అనుకున్న రేంజ్ లో…

వర్కౌట్ అయితే అవ్వలేదు కానీ ఎలివేషన్స్ పరంగా మాత్రం పార్ట్ 1 కి ఏమాత్రం తీసిపోదు పార్ట్ 2…. హీరో ఇంట్రో కానీ తూఫాన్ సాంగ్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ కానీ ఓ రేంజ్ లో హీరోయిజాన్ని ఎలివేట్ చేశాయి. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ ఒక్కటి చాలు టికెట్ డబ్బులు గిట్టుబాటు అవ్వడానికి అని చెప్పే రేంజ్ లో దుమ్ము లేపాడు ప్రశాంత్ నీల్…. యష్ తన రోల్ వరకు కుమ్మేశాడు, ప్రభాస్ లా యష్ కూడా విలన్స్ ని కొడుతుంటే నిజంగానే గట్టిగా కొడుతున్నాడు అనిపించేలా ఉన్న కటౌట్ తో రెచ్చిపోయాడు…

ఎలివేషన్స్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. ఇక శ్రీనిధి శెట్టి రోల్ కి ఓ ట్విస్ట్ ఇచ్చి సెకెండ్ ఆఫ్ లో కథ టర్న్ అయ్యేలా చేయగా, రవీనా టండన్ రోల్ కూడా ఆకట్టుకుంటుంది…. ఇక సంజయ్ దత్ విలనిజం మరీ హైప్ ఇచ్చినంత…లేదనే చెప్పాలి. జస్ట్ ఓకే అనిపించేలా ఉండగా ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ఆకట్టుకోగా మిగిలిన నటీనటులు పర్వాలేదు అనిపించారు…. ఇక సినిమాకి మేజర్ హైలెట్ సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి.

సాంగ్స్ ఆకట్టుకోగా బ్యాగ్రౌండ్ స్కోర్ కొంచం లౌడ్ గా ఉన్నప్పటికీ ప్రతీ సీన్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసింది అని చెప్పాలి… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ కొంచం స్లో అవ్వగా సెకెండ్ ఆఫ్ లో కూడా కొంచం స్లో డౌన్ అవుతుంది, సినిమాటోగ్రఫీ అదిరిపోగా కొన్ని షాట్స్ హాలీవుడ్ రేంజ్ ని తలపించేలా మెప్పించాయి… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదిరిపోయాయి అని చెప్పాలి. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్ విషయానికి వస్తే….

కేజిఎఫ్ పార్ట్ 2 అంటే ఆడియన్స్ ఎక్కువగా ఆశలు పెంచుకునేది ఎలివేషన్ సీన్స్ మీదే…ఆ విషయంలో మట్టుకు ఫుల్ మార్కులు కొట్టేశాడు ప్రశాంత్ నీల్, కానీ కథ పరంగా ఫస్ట్ పార్ట్ లో ఉన్న ఎమోషనల్ టచ్ సెకెండ్ ఆఫ్ లో లేదనిపించగా, స్క్రీన్ ప్లే కూడా కొంచం కన్ఫ్యూజ్ అయ్యేలా చేయడం మరో మైనస్ పాయింట్… కథ కూడా ప్రిడిక్ట్ చేసేలా ఉండటం కూడా ఒక మైనస్ కాగా మొత్తం మీద ఎలివేశన్స్ విషయంలో దుమ్ము లేపినా మిగిలిన విషయాల్లో మట్టుకు కొంచం నిరాశ పరిచాడు…

మొత్తం మీద హైలెట్స్ విషయానికి వస్తే ఎలివేషన్ సీన్స్ అన్ని దుమ్ము లేపాయి, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎమోషనల్ డెప్త్ మిస్ అవ్వడం, కథ డ్రాగ్ అవ్వడం, విలన్ అనుకున్న రేంజ్ పవర్ ఫుల్ గా లేక పోవడం లాంటివి అని చెప్పొచ్చు. అయినా కానీ ఆడియన్స్ సినిమా నుండి ఏమైతే కోరుకుంటారో….

అవి చాలా వరకు సినిమా లో ఉండటం తో మొదటి పార్ట్ మాదిరిగానే మాస్ ఆడియన్స్ కి ఎలివేషన్ సీన్స్ ఇష్టపడే వాళ్ళకి కేజిఎఫ్ ఫస్ట్ పార్ట్ నచ్చిన వాళ్ళందరికీ కూడా సెకెండ్ పార్ట్ కూడా నచ్చుతుంది… మొత్తం మీద ఇక బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వడం అయితే ఖాయం…. ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here