బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ అనేది అన్ని వేళలా సరైన నిర్ణయం కాదు కానీ అప్పుడప్పుడు సినిమాల మధ్య క్లాష్ అనేది జరుగుతూ ఉంటుంది…. పండగ టైం లో అంటే ఎలాగోలా టాక్ కొంచం అటూ ఇటూగా ఉన్నా కలెక్షన్స్ వస్తాయి కానీ నార్మల్ టైం లో క్లాష్ అంటే టాక్ బాగున్న సినిమాకే జై కొడతారు జనాలు. కాగా కొన్ని ఓన్ లాంగ్వేజ్ మూవీస్ తో పోటికి వచ్చిన డబ్బింగ్ మూవీస్…
డామినేట్ చేసిన సందర్బాలు టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. కానీ తమిళనాడు లో ప్రస్తుతం టాప్ హీరోగా కొనసాగుతున్న దళపతి విజయ్ నటించిన బీస్ట్ సినిమా కి పోటిగా వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా రిలీజ్ డేట్ ని ఎప్పుడో ఏప్రిల్ 14కే అనౌన్స్ చేశారు మేకర్స్…
బీస్ట్ కూడా తర్వాత అదే డేట్ ని అనుకున్నా తర్వాత డేట్ ని చెప్పక పోవడంతో సినిమా డేట్ మారుతుంది అనుకున్నారు కానీ ఒకరోజు ముందుకు జరిపి 13న సినిమా రిలీజ్ ను అనౌన్స్ చేయగా ఓపెనింగ్స్ పరంగా ఫస్ట్ డే కుమ్మేసిన ఈ సినిమా టాక్ మిక్సుడ్ గా రావడంతో…
మిగిలిన అన్ని చోట్లా కేజిఎఫ్ 2 కి ఏమాత్రం పోటి ఇవ్వలేక పోయింది. తమిళనాడులో ఎలాగోలా థియేటర్స్ భారీగా ఉండటంతో వీకెండ్ వరకు హోల్డ్ చేసినా వర్కింగ్ డేస్ నుండి చేతులు ఎత్తేసి కేజిఎఫ్2 కి దారి క్లియర్ చేసింది. వర్కింగ్ డేస్ నుండి ఇప్పటి వరకు ప్రతీ రోజూ థియేటర్స్ ని పెంచుకుంటూ వచ్చిన కేజిఎఫ్ 2 సినిమా విజయ్ బీస్ట్ ని వెనక్కి నెట్టి ఎక్కువ కలెక్షన్స్ ని…సొంతం చేసుకుంటూ ఇప్పుడు సెకెండ్ వీక్ లో భారీగా థియేటర్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపుతూ దూసుకు పోతుంది,
ఆల్ రెడీ అన్ని చోట్లా బీస్ట్ ను డామినేట్ చేసిన కేజిఎఫ్2 ఓన్ ప్లేస్ లో కూడా డామినేట్ చేస్తూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఊరమాస్ రికార్డులు క్రియేట్ చేస్తూ ఉండటం విశేషం…. అదే టైం లో పోటిలో కాకుండా సోలోగా వచ్చి ఉంటే బీస్ట్ మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండేది. అయినా కానీ మిక్సుడ్ టాక్ తో కూడా సినిమా తమిళనాడులో 100 కోట్లకు పైగా గ్రాస్ తో బాగానే జోరు చూపించింది అని చెప్పాలి.