థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేసుకోలేని పరిస్థితులు ఉన్న నేపధ్యంలో దాదాపు అన్ని సినిమాలకు కూడా డిజిటల్ రిలీజే దిక్కు అయింది, చిన్న పెద్దా అని తేడా లేకుండా మంచి ఆఫర్ అనిపిస్తే చాలు అన్ని సినిమాలు కూడా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఇన్ని రోజులు ఇష్టం వచ్చినంత ఖర్చు చేసిన OTT కి పెద్దగా లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు వేళ్ళ మీదే లెక్క పెట్టొచ్చు.
దాంతో కొత్త రూట్ ని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు…. సినిమాలు ఎలా ఉన్నాయో తెలియకుండా కోట్లకి కోట్లు పోయడం కన్నా సినిమాలను తమ ప్లాట్ ఫాం లో రిలీజ్ చేసి పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ చేసి వచ్చిన డబ్బులను నిర్మాతలతో కలిసి…
పంచుకోవడం బెటర్ అని ఆలోచించగా… ఈ పద్దతిలోనే ముందు వి మూవీ ని రిలీజ్ చేయాలి అనుకున్నా కుదరలేదు, ఇక అఫీషియల్ గా ఇండియా లో ఈ పద్దతి లో రిలీజ్ కాబోతున్న మొదటి సినిమాగా అనన్య పాండే నటిస్తున్న కొత్త సినిమా ఖాళీ పీలి సినిమా అని చెప్పాలి.
అక్టోబర్ 2 న జీ ప్లెక్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కి ఇప్పుడు టికెట్ రేటు ని ఫిక్స్ చేశారు, ఆ రేటు చూసి అందరూ షాక్ అవుతున్నారు, బయట ఒక సినిమా చూడాలి అంటే టికెట్ రేటు యావరేజ్ గా 100 నుండి 150 పెద్ద సినిమా అయితే 200 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పాలి.
కానీ ఈ సినిమా కి వచ్చే సరికి ఏకంగా రేటు ని 299 కి ఫిక్స్ చేశారు… ఈ పాటి సినిమా కి ఆల్ మోస్ట్ 300 పెట్టి ఎవరూ చూడరు అంటూ సోషల్ మీడియా లో ఆల్ రెడీ చర్చ జరుగుతుండగా నెపో కిడ్స్ చేస్తున్న సినిమా అవ్వడం తో కచ్చితంగా బాయి కాట్ చేసి తీరుతాం అంటున్నారు… దాంతో ఇప్పుడు సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది, టికెట్స్ ఎన్ని తెగుతాయి అన్నది ఆసక్తి కరంగా మారింది.