కోట్లు కోట్లు ఖర్చు చేసి కొన్న సినిమాలు OTT యాప్స్ కి పెద్దగా లాభం అయితే ఇవ్వడం లేదు, ఏవో ఒకటి రెండు సినిమాలు తప్ప చాలా వరకు సినిమాలు డౌట్ అనుకున్నవే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తుండటం తో రిలీజ్ అయిన ఒకటి రెండు రోజులు తప్పించి తర్వాత ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ అవుతున్న పరిస్థితి పెరుగున్న వేల OTT యాప్స్ కొత్త స్కీమ్ ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
లో బజ్ ఉన్న లేదా ప్రయోగం కోసమో కొన్ని సినిమాలను సెలెక్ట్ చేసి పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేయబోతున్నాయి. వీటిలో ముందుగా అక్టోబర్ 2 న ఒక హిందీ మూవీ ఒక తమిళ్ మూవీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని ఈ పద్దతిలో సొంతం చేసుకోబోతున్నాయి.
అనన్య పాండే లేటెస్ట్ మూవీ ఖాళీ పీలి, మరియు విజయ్ సేతుపతి నటించిన లేటెస్ట్ మూవీ కా పే రణ సింగం సినిమాలు ఒకే రోజున జీ ప్లెక్స్ లో రిలీజ్ కానుండగా ఖాళీ పీలి సినిమా కి టికెట్ రేటు 299 పెట్టగా, కా పే రణ సింగం సినిమా కి 199 టికెట్ రేటు ఫిక్స్ చేశారు.
ఈ విధంగా మొదటి మూడు వారాలు రేటు పెట్టి తర్వాత రేటు ని నార్మల్ చేస్తారని సమాచారం. కానీ ఈ రేటు చూసి సోషల్ మీడియా లో అందరూ విమర్శలను గుప్పిస్తున్నారు. రిలీజ్ అయిన గంటల్లోనే మాస్టర్ ప్రింట్ పైరసీ లో వస్తుంది కాబట్టి ఈ రేటు పెట్టి చూసే బదులు ఆ ప్రింట్ డౌన్ లోడ్ చేసుకోని చూడటం బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇలా కాకుండా మామూలు రేటు పెట్టి ఉంటే అక్కడ ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది కదా అన్న ప్రశ్నకి విశ్లేషకులు మాత్రం ఎలాగైనా పైరసీ లో చూడాలి అనుకున్న వాళ్ళు చూస్తారు, రేటు ఎక్కువ పెట్టడం వలన ఎంతో కొంత రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది అని ఈ పద్దతిని పాటిస్తున్నారు అని అంటున్నారు. మరి సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి..