చేసింది తక్కువ సినిమాలే అయినా సౌత్ టు నార్త్ అన్ని చోట్లా మంచి క్రేజ్ ని ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ కియరా అద్వాని నటించిన లేటెస్ట్ మూవీ ఇందు కి జవానీ డైరెక్ట్ రిలీజ్ కి ఆఫర్లు వచ్చినా నో చెప్పి బాలీవుడ్ తరుపున థియేటర్స్ లో రిలీజ్ అయిన మొదటి కొత్త సినిమాగా నిలిచింది, రీసెంట్ గా రిలీజ్ అయిన ఇందు కి జవానీ ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే… లవ్ బ్రేక్ అప్ చేసుకున్న హీరోయిన్ ఫ్రెండ్ అడ్వైజ్ తో ఒక డేటింగ్ యాప్ లో స్త్రెంజర్ తో డేట్ చేయాలనీ డిసైడ్ అవుతుంది, తర్వాత డేట్ కి ఇంట్లో ఎవరూ లేని టైం ని ఎంచుకోగా వచ్చిన వ్యక్తీ మాటల్లో తను పాకిస్తాన్ నుండి వచ్చాడు అని తెలుస్తుంది…
తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ పాయింట్… పెర్ఫార్మెన్స్ పరంగా కియరా అద్వాని తన పాత్ర వరకు ఫుల్ ఎంటర్ టైన్ చేసింది, అమాయకమైన అమ్మాయిగా కొన్ని సార్లు, లేదూ ఫుల్ కాన్ఫిడెంట్స్ ఉన్న అమ్మాయిగా కొన్ని సార్లు తన నటన మెప్పిస్తుంది. ఇక హీరో పాత్ర జస్ట్ ఓకే అనిపించగా…
హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర కొంచం ఇరిటేట్ చేస్తుంది, మిగిలిన పాత్రలు కూడా ఉన్నంతలో జస్ట్ యావరేజ్ అనిపించాయి. చిన్న కథ పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా ను ఆల్ మోస్ట్ 2 గంటల పాటు సాగదీసి పిచ్చి ఎక్కించాడు డైరెక్టర్… ఫస్టాఫ్ వరకు కొన్ని కొన్ని సీన్స్ కామెడీ గా వర్కౌట్ అయినా కానీ అవే సీన్స్ ని రిపీట్ గా వాడుతూ..
హీరో హీరోయిన్స్ ఇద్దరూ కూడా మీ పాకిస్తాన్ ఇలాంటిది అంటూ హీరోయిన్ మీ ఇండియా ఇలాంటిది అంటూ హీరో ఒకరి దేశం మీద ఒకరు కామెంట్స్ చేసుకుంటూ సినిమా సెకెండ్ ఆఫ్ చాలా టైం కథని నడిపారు. ఇది చూస్తున్న ఆడియన్స్ తలలు పట్టుకుని ఇదేమి టార్చర్ రా బాబు అనుకునే లెవల్ కి వెళ్ళారు అని చెప్పాలి.
సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించాగా, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే నాసిరకం అని చెప్పాలి, ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగుండగా డైరెక్షన్ పరంగా డైరెక్టర్ కి మైనస్ మార్కులు పడాలి అని చెప్పొచ్చు. ఇంత చిన్న కథతో ఆడియన్స్ ని టార్చర్ చేశాడు అని చెప్పొచ్చు.
ఉన్నంతలో కొన్ని సీన్స్ కామెడీ వర్కౌట్ చేసినా… హీరోయిన్ రోల్ తింగరి తనంతో కొంచం కామెడీ చేసినా కానీ మొత్తం మీద సినిమా చాలా సిల్లీ గా అనిపిస్తుంది అని చెప్పాలి.
థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక వచ్చిన సినిమా అవ్వడం వలన వెళ్ళాల్సి వచ్చింది కానీ OTT లో రిలీజ్ అయినా పెద్దగా ఎవ్వరూ పట్టించుకునే సినిమా కూడా కాదు ఈ సినిమా.. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2 స్టార్స్….