Home న్యూస్ సల్మాన్ ఖాన్ సినిమా…బుకింగ్స్ చూసి ట్రేడ్ శాకవుతుందిగా!!

సల్మాన్ ఖాన్ సినిమా…బుకింగ్స్ చూసి ట్రేడ్ శాకవుతుందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రంజాన్ సీజన్ లో ఎప్పటి కప్పుడు తన సినిమాలతో ఆడియన్స్ ను అలరించే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రీసెంట్ మూవీస్ ఏవి కూడా అంచనాలను అందుకోలేదు. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రంజాన్ కానుకగా తన లేటెస్ట్ మూవీ కిసికీ భాయ్ కిసీకి జాన్ సినిమా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యి….

4 రోజులు అవుతూ ఉండగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ వర్గాలు కూడా శాకవుతున్నాయి ఇప్పుడు… సల్మాన్ ఖాన్ సినిమా రంజాన్ కి వస్తుంది అంటే ఆ సినిమా బుకింగ్స్ కానీ ఓపెనింగ్స్ కానీ ఓ రేంజ్ లో రికార్డులు సృష్టించే విధంగా ఉండేవి…

కానీ ఇప్పుడు రిలీజ్ కి ఒక్క రోజు గ్యాప్ మాత్రమే ఉన్నా కూడా ఇప్పటి వరకు ఈ సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నీరసంగా ఉండగా ప్రజెంట్ బుకింగ్స్ ని బట్టి చూస్తూ ఉంటే తొలిరోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 15 కోట్లకు పైగా…

నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 18-20 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. సల్మాన్ ఖాన్ సినిమా కి ఇలాంటి ఓపెనింగ్స్ అంటే చాలా తక్కువే అని చెప్పాలి. మరి టాక్ బాగుండి కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here