టాలీవుడ్ లో అపజయం అంటే తెలియకుండా కెరీర్ ని కొనసాగిస్తున్న డైరెక్టర్స్ లో కొరటాల శివ కూడా ఒకరు, మాస్ ని క్లాస్ ని కలిపి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తర్వాత రెండేళ్ళ టైం ని తన అప్ కమింగ్ మూవీ అయిన మెగాస్టార్ చిరంజీవి తో చేస్తున్న ఆచార్య…
కోసమే కేటాయించగా… మరికొంత టైం ఈ సినిమా కే పరిమితమం అయ్యేలా ఉండగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రీసెంట్ గా చిరు బర్త్ డే కానుకగా రిలీజ్ చేశారు, మోషన్ పోస్టర్ లో ధర్మస్థలి పేరు చూసి ఈ కథ నాదే అంటూ ఒక వ్యక్తి మీడియా లో…
ఇంటర్వ్యూలు ఇవ్వడం తో అది టీం దగ్గరకు కూడా వెళ్ళగా అసలు ఈ కథకి ఆ కథ కి పోలిక లేదని, సినిమా రిలీజ్ అయ్యాక అప్పుడు చెప్పండి అంటూ కౌంటర్ వేశారు, అయినా సినిమా కాపీ కథ అంటూ కథనాలు ఆగక పోవడం తో ఇప్పుడు కొరటాల శివ…
పరువు నష్టం దావా కింద కేసు వేశారని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు, ఎంతో కష్టపడి రాసుకుని రెండేళ్ళుగా ఈ సినిమా కోసమే పనిచేస్తుంటే కథ నాది అంటూ రావడం ఏంటి అని ఏకంగా లీగల్ గా వెళ్ళడానికి సిద్ధం అయ్యారట కొరటాల శివ, దాంతో కొరటాల శివ కాన్ఫిడెంట్స్ చూసి ఇది తన ఒరిజినల్ కథే అయ్యి ఉండొచ్చు అని అంతా భావిస్తున్నారు.
ఇది వరకు కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా టైం లో కూడా కథ నాదే అంటూ కొందరు రాగా ఆ టైం లో కూడా కొరటాల శివ గట్టిగానే స్పందించారు. ఇప్పుడు ఏకంగా తిరిగి కేసు వేయడం అందరికీ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి. మరి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది…