మాస్ మహారాజ్ రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ క్రాక్ రవితేజ కి బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా వచ్చిన నాలుగు బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ కి చెక్ పెట్టి సూపర్ సక్సెస్ గా నిలిచిన సినిమాగా మారిన విషయం తెలిసిందే. 50% ఆక్యుపెన్సీ తోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా…
నిలిచిన సినిమాగా మారగా సినిమా తర్వాత డిజిటల్ రిలీజ్ అయినా సూపర్ వ్యూస్ తో దుమ్ము లేపగా లాస్ట్ కి టెలివిజన్ లో కూడా అల్టిమేట్ TRP రేటింగ్స్ తో దూసుకు పోతుంది ఈ సినిమా. సినిమా శాటిలైట్ రైట్స్ హక్కులను స్టార్ మా ఛానెల్ వాళ్ళు….
6 కోట్ల రేటు చెల్లించి సొంతం చేసుకోగా సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ తోనే సాలిడ్ TRP రేటింగ్ ను సొంతం చేసుకుని సత్తా చాటగా తర్వాత కూడా రెండో సారి దుమ్ము లేపే రేటింగ్ ను సాధించి రీసెంట్ గా మూడో సారి కూడా రెండో సారి కన్నా ఎక్కువ రేటింగ్ ను అందుకుంది.
మొత్తం మీద క్రాక్ సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 11.71 రేటింగ్ ను సొంతం చేసుకోగా రెండో సారి టెలికాస్ట్ అయినప్పుడు 7.52 రేటింగ్ ను దక్కించుకుని సత్తా చాటుకుంది. ఇక రీసెంట్ గా సినిమా మూడో సారి టెలికాస్ట్ అవ్వగా రెండో సారి కన్నా ఎక్కువ రేటింగ్ ను 7.92 వరకు సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది క్రాక్ సినిమా….
మొత్తం మీద పెట్టిన రేటు ని ఆల్ మోస్ట్ మొదటి సారే అందుకున్న సినిమా రెండో సారికి కంప్లీట్ ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవ్వగా ఇప్పుడు మూడో టెలికాస్ట్ తో ఛానెల్ కి అల్టిమేట్ ప్రాఫిట్స్ ను తెప్పిస్తుంది అని చెప్పొచ్చు. దాంతో కంప్లీట్ గా అన్ని చోట్ల ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ తో క్రాక్ సినిమా ఊరమాస్ పవర్ ని చూపింది అని చెప్పాలి.