మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన స్టైల్ హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది, రాజా ది గ్రేట్ తో మంచి కంబ్యాక్ కొట్టినా కానీ తర్వాత చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరచగా ఈ ఏడాది డిస్కో రాజా మీద ఆశలు భారీగా పెట్టుకున్న ఈ సినిమా కూడా తీవ్రంగా నిరాశ పరిచి డిసాస్టర్ అయ్యింది, ఇలాంటి టైం లో తనకి ఇది వరకు…
డాన్ శీను, బలుపు లాంటి మాస్ హిట్స్ అందించిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్న రవితేజ ఈ సినిమా ను సమ్మర్ రేసు లో నిలపాలి అని ట్రై చేసినా కరోనా వల్ల కుదరలేదు, పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బాలెన్స్ ఉన్న…
ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ని రీసెంట్ గా మొదలు పెట్టగా కొన్ని రోజుల్లో బాలెన్స్ షూట్ మొత్తం కంప్లీట్ అవుతుందని సమాచారం. థియేటర్స్ 15 నుండి రీ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా దసరా కి ప్లాన్ చేస్తున్నారు అన్న టాక్ వచ్చినా ఇప్పుడు వచ్చే నెలకి ప్లాన్ షిఫ్ట్ చేశారట.
కుదిరితే దీపావళి కి రంగం లోకి దిగాలి అన్న భావన లో టీం ఉండగా సినిమా కి డైరెక్ట్ రిలీజ్ కోసం సాలిడ్ ఆఫర్ వచ్చిందని టాక్ ట్రేడ్ లో వినిపిస్తుంది, ఇది వరకు సినిమా కి 22 కోట్ల రేంజ్ ఆఫర్ రాగా సినిమా బడ్జెట్ 34 కోట్ల రేంజ్ లో ఉండటం తో ఆ ఆఫర్ దరిదాపుల్లో కూడా లేక పోవడం తో నో చెప్పారు.
ఇప్పుడు సినిమా కి అమెజాన్ ప్రైమ్ నుండి 26 కోట్ల నుండి 28 కోట్ల మధ్యలో డీల్ చేసుకోవడానికి మేం సిద్ధం అంటూ మంచి ఆఫర్ ఇచ్చారట.. బడ్జెట్ దృశ్యా ఇంకా రేటు తక్కువే అయినా కానీ రవితేజ ప్రీవియస్ మూవీస్ బిజినెస్ లతో పోల్చితే ఇది ఎక్కువే అని చెప్పాలి, కానీ మేకర్స్ ఇంకా థియేటర్స్ వైపే ఉన్నారని సమాచారం. త్వరలోనే కొత్త అప్ డేట్ రావొచ్చని అంటున్నారు.